రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మాస్ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాకు ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అవగా హాట్ కేకుల్లా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఇది నిజంగానే మంచి తరుణమని చెప్పాలి. స్టార్ సినిమాల రేంజ్ లో విజయ్ దేవరకొండ లైగర్ బుకిగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు.
ఈ రకంగా చూస్తే లైగర్ మొదటిరోజు భారీ కలక్షన్స్ తెచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ ని బట్టి చూస్తే లైగర్ ఫస్ట్ డే 30 కోట్ల దాకా తెచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )కి అది మంచి ఫిగర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.
సినిమాలో విజయ్ మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. ఈ సినిమాని హిందీలో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. మైక్ టైసన్ కూడా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.