Vijay Devarakonda : లైగర్ కి సెన్సార్ దిమ్మతిరిగే షాక్.. ఆ సీన్స్ తొలగింపు..!

పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) హీరోగా వస్తున్న సినిమా లైగర్. పూరీ, చార్మీతో పాటుగా కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. పాన్ ఇండియా సినిమాగా ఆగష్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది లైగర్. ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న లైగర్ సినిమాకు సెన్సార్ టీం షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మాములుగానే పూరీ సినిమాల్లో కొన్ని బూతులు ఉంటాయి. కొన్ని హ్యాండ్ సైగలు.. మిడుల్ ఫింగర్ బ్లర్ చేయడం.. F వర్డ్ ని ఎక్కువసార్లు వాడటంతో అది కూడా బీప్ వేయడం జరిగిందట. అంతేకాదు లైగర్ సినిమాని పూర్తి టైటిల్ లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ గా కూడా సెన్సార్ ఫిక్స్ చేసిందని తెలుస్తుంది. లైగర్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) బాక్సర్ గా కనిపిస్తున్నాడు.

అయితే విజయ్ పాత్ర చాలా మాస్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో ఆ పాత్రకు తగినట్టుగానే పూరీ మార్క్ డైలాగ్స్ రాసుకోగా వాటికి సెన్సార్ టీం షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి సినిమాపై వాటి ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.

Tags: ananya pandey, liger, puri jagannath, Tollywood, Vijay Devarakonda