Vijay Devarakonda : లైగర్ సీక్వల్.. రౌడీ హీరో హింట్ ఇచ్చేశాడు..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సర్సన అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. ఆగష్టు 25న భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో లైగర్ పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు రౌడీ హీరో.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి పూరీ సీక్వల్ ఆలోచన కూడా చేస్తున్నారని అన్నాడు. లైగర్ సినిమా అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే లైగర్ 2 కూడా పక్కా ఉంటుందని అంటున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆల్రెడీ లైగర్ రిలీజ్ అవకుండానే జన గణ మన సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఇక ఇప్పుడు లైగర్ 2 కూడా ఉంటుందని అంటున్నాడు. పూరీతో ఒకేసారి 3 సినిమాల డీల్ కుదురుచుకున్నాడనుకుంటా మన రౌడీ బోయ్. లైగర్ సినిమా మైక్ టైసన్ కూడా నటించారు. సినిమాలో ఆయన పోర్షన్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. విజయ్, అనన్యాల రొమాన్స్ కూడా సినిమాలో మేజర్ హైలెట్ అవుతుందని చెబుతున్నారు.

Tags: ananya pandey, Charmy, liger, Liger 2, puri jagannath, Tollywood, Vijay Devarakonda