కోహినూర్ ఫైట్ ప‌వ‌న్ సినిమాకే హైలేటు అంటున్న క్రిష్ ..?

రెండేళ్ల విరామం త‌రువాత కెమెరా ముందుకు వ‌స్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌క‌చ‌కా సినిమాల‌ను చేస్తున్నారు. ఒక్కో క‌థ‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తూ వ‌చ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసేలా క‌న‌బ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న చేస్తున్న పింక్ రీమేక్ వ‌కీల్‌సాబ్ సినిమా షూటింగ్ దాదాపు చివ‌ర‌కు ద‌శ‌కు చేరుకుంది. దిల్ రాజు, బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఆ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, అది రికార్డుల‌ను సృష్టిస్తున్న‌ది. ప‌వ‌న్ స్టామినాను మ‌రోసారి చాటింది. ఇక ఆ సినిమాతో పాటుగా పీకే త‌న 27 చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

పిరాయాడిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో ప‌వ‌ర్‌స్టార్ రాబిన్‌హుడ్ పాత్రలో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఇప్పుడు ఫైట్ స‌న్నీవేశాల‌ను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. అందులోనూ అది ‘కోహినూర్’ వజ్రం కోసం జరిగే పోరాట‌మ‌ట‌. ఇక సినిమాకే ఆ ఫైటింగ్ సీన్లే హైల‌ట్‌గా నిల‌వ‌బోతున్నాయ‌ని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం. ఇక సినిమాలో హాట్ యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనున్న‌ట్లు చిత్ర‌వ‌ర్గాల టాక్‌. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో గానీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags: Fight, Kohinoor Diamond, krish, pawankalyan, Tollywood