బాలీవుడ్ లో భారీగా విడుదలైన కార్తికేయ- 2..!

నిఖిల్ సిద్ధార్థ్, కలర్స్ స్వాతి, చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే నిఖిల్ తన కెరీర్ లో మొదటి సారి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. హీరోగా సెటిల్ అయిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు మళ్లీ సీక్వెల్ గా కార్తికేయ- 2 విడుదలైంది. తెలుగులో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీగా విడుదల అయింది.

కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేయగా అది ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే అక్కడి టీవీ ఛానళ్లలో ప్లే అయ్యింది. దీంతో ఈ సినిమాపై నార్త్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మేకర్స్ కార్తికేయ 2 సినిమాను తెలుగుతో పాటు ఒకేసారి తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇవాళ విడుదల చేశారు.

ఈ సినిమా హిందీలో ఏకంగా 200 స్క్రీన్ లలో విడుదలయింది. ఇప్పటికే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ బాలీవుడ్ లో తమ సత్తా చాటారు. ఇప్పుడు భారీ అంచనాలతో నిఖిల్ సినిమా హిందీలో విడుదలవుతోంది. ఈ సినిమా బాలీవుడ్ లో విజయవంతమైతే తెలుగు నుంచి మరో పాన్ ఇండియా స్టార్ అవతరించనున్నాడు. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా ఫలితం తేలనుంది. కాగా కార్తికేయ సినిమాలో హీరోయిన్ గా స్వాతి నటించగా ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

Tags: actor nikhil, bollywood news, karthikeyan 2 movie, tollywood news