7 రోజులు..60 కోట్ల వసూళ్లు.. కార్తికేయ సెన్సేషనల్..!

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా సంచలనం సృష్టిస్తోంది.
ఒక తెలుగు సినిమా హిందీలో అక్కడి సినిమాలు థియేటర్లలో ఆడుతున్నప్పటికీ హౌస్ ఫుల్స్ తో నడుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా నార్త్ లో మూడు వేల థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా కూడా ముందుగా చిన్న మొత్తంలోనే వసూళ్లు సాధించింది. ఆ తర్వాత మౌత్ టాక్ తో దూసుకెళ్లి అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరింది.

ప్రస్తుతం కార్తికేయ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటోంది. థియేటర్ల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక ట్వీట్ చేశారు. కార్తికేయ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7రోజుల్లో 60.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రకటించాడు. తమను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

నిఖిల్ హీరోగా నటించిన ఏ సినిమా కూడా వారం రోజుల్లో ఈ రేంజిలో కలెక్షన్లు సాధించిన సినిమా మరొకటి లేదు. కార్తికేయ సూపర్ హిట్ గా నిలిచిన ప్పటికీ అది తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. కార్తికేయ2కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు హీరో నిఖిల్ చిత్ర బృందంతో కలసి వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Tags: actor nikhil, karthikeya 2 movie, karthikeya 2 movie collections, tollywod news