యంగ్ టైగ‌ర్ న‌టించిన ఒకే ఒక‌ టీవీ సీరియల్ ఏంటో తెలుసా..!

సినీ సెలెబ్రిటీలు బుల్లితెరపై సందడి చేస్తుండటం కామన్ అయినా కొందరు మాత్రం అందులో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ బుల్లితెరపై సూపర్ రెస్పాన్స్ అందుకోగా.. అంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్నితెరపై సందడి చేసి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. వెండితెరపై స్టార్ హీరోగా సత్తా చాటుతున్న ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌ బాస్ షోలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆయన రెండు టీవీ షోస్ చేస్తే, ఆ రెండింటికీ ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్రతో ప్రేక్షకులను పలకరించి అలలరించారు. ఇందులో నాటు నాటు పాటను రామ్ చరణ్‌తో చేసాడు. ఈ పాటకు ప్రపంచ ప్రేక్షకులు దాసోహం అన్నారు.

25 years for 'Bala Ramayanam', NTR was scolded by Gunasekhar ???

ఆస్కార్ మన దేశానికి నడుచుకుంటూ వచ్చింది. తారక్ స్మాల్ స్క్రీన్ పై ఓ సీరియల్ కూడా చేసారు. ఈ సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈటీవీ మొదలు పెట్టిన కొత్తలో ఈ సీరియల్ వచ్చింది. చాలా తక్కువ రోజులే ప్రసారమైంది. ఇందులో ఎన్టీఆర్ మార్కండేయుడిగా నటించాడు. శివ భక్తుడిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. ఎన్టీఆర్ ఈ గెటప్‌లో ఉన్నప్పటి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jr NTR looks unmissable in rare pics from debut film Bala Ramayanam - India  Today

జూనియర్ ఎన్టీఆర్‌కు స్మాల్ స్క్రీన్‌కు కొత్తేం కాదు. ఆ సినిమాల‌ కంటే ముందే.. ఎన్టీఆర్ ఓ టెలి సిరీయల్‌లో నటించారు. ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా తన సత్తా ఏంటో చూపించారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా తన క్రేజ్‌ను అంతకంతకు పెంచుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.