ఆ సెంటిమెంట్‌తో పవన్ కళ్యాణ్ ‘ బ్రో ‘ సూప‌ర్ హిట్టేనా…!

చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ల‌లో చాలామంది సెంటిమెంట్స్ బాగా నమ్ముతారు. ఓ స్టార్ హీరో వరుసగా ఒకే తేదీలో భారీ విజయాలను అందుకుంటే ఆ హీరో ఆ డేట్ ను తన సెంటిమెంట్ గా మార్చుకుంటాడు. తన సినిమాలను కూడా ఆ డేట్‌నే రిలీజ్ చేయాల‌ని అనుకుంటాడు. ఇప్పుడు అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా కొన్ని సెంటిమెంట్స్ బాగా కలిసి వచ్చాయి. ఆయన కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలన్నీ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అలా వచ్చిన వాటిలో ఖుషి, గబ్బర్ సింగ్, జల్సా సినిమాలు సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. అదే సమ్మర్లో జానీ, బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు నిరాశపరిచాయి. ఆయనకు తిరుగులేని స్టార్‌డ‌మ్‌ ఇచ్చిన మెజారిటీ సినిమాలు సమ్మర్ లోనే ప్రేక్షకు ముందుకు వచ్చాయి. సమ్మర్ తర్వాత పవర్ స్టార్‌కి కలిసి వచ్చిన నెల జులై.

పవర్ స్టార్ సినిమాల్లో అభిమానులకు, సినీ ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమా తొలిప్రేమ. ఆ త‌ర్వాత‌ తమ్ముడు.. ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్ లోనే మంచి క్లాసికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలో వచ్చినా వాటికి భారీ స్థాయిలో టీఆర్పి రేటింగ్ వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా జూలై నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక తొలిప్రేమ 1998 జులై 24న ప్రేక్షకుల ముందుకు రాగా, తమ్ముడు 1999 జులై 15న గ్రాండ్ గా విడుదలైంది.

ఈ రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమాలుగా నిలిచాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న బ్రో కూడా జులై 28న ప్రేక్షకు ముందుకు రాబోతుందింది. ఈ సినిమాకు కూడా ఈ సెంటిమెంట్ బాగా కలిసి వస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ తో కలిసి నటిస్తున్నాడు. ఇక ఈ మామ అల్లుళ్లు ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు అందుకుంటారో చూడాలి.