“బింబిసార” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా “బింబిసార” . ఇప్పటికే ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్స్ తో ఈ సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ ఫాంటసీ డ్రామా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే జూలై 29న జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని చూశారని, దాని అవుట్‌పుట్‌ బాగా నచ్చిందని వినికిడి.అయితే ఇప్పటికే సినిమాకు మంచి బజ్ ఉంది.

పుకార్లు నిజమైతే, ఎన్టీఆర్ ఈ సినిమాకి మంచి హైప్‌ను నెక్స్ట్ లెవెలికి తీసుకువెళుతుంది. “బింబిసార”సినిమాకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి నూతన దర్శకుడు వశిస్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Tags: bimbisara movie, bimbisara pre release event, jr ntr, Kalyan Ram, telugu news, tollywood news