ఈ సారి ఆ ఎంపీని చంద్ర‌బాబే ప‌క్కాగా గెలిపిస్తున్నారా…!

చిత్తూరు ఎంపీ సీటు..నో డౌట్ టీడీపీకి కంచుకోట..ఇక్కడ ఎలాంటి పరిస్తితుల్లోనైనా టి‌డి‌పి గెలుపు ఖాయమే. అయితే ఇక్కడ చిత్తూరు ఎంపీ సీటు టి‌డి‌పికి కంచుకోట గాని..పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని అసెంబ్లీ సీట్లలో టి‌డి‌పికి పట్టు లేదు..అయినా సరే ఎంపీ సీటు గెలవడానికి కారణం కుప్పం. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వల్లే..చిత్తూరు ఎంపీ సీటుని టి‌డి‌పి కైవసం చేసుకుంటుంది.

 

నిజానికి చిత్తూరు పార్లమెంట్ లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు టి‌డి‌పి గెలుచుకోపోయినా సరే..కుప్పంలో టి‌డి‌పికి వచ్చే మెజారిటీతో చిత్తూరు ఎంపీ సీటుని సైతం గెలుచుకుంటూ వస్తుంది. ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలు సాధిస్తూ వస్తుంది. 1984లో గెలిచిన టి‌డి‌పి..1996, 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. ఇలా టి‌డి‌పి వరుసగా గెలవడానికి కారణం కుప్పంలో వచ్చే మెజారిటీ వల్లే.

అయితే గత ఎన్నికల్లో కుప్పంలో బాబుకు మెజారిటీ తగ్గింది..అటు పార్లమెంట్ లో ఉన్న ఆరు స్థానాల్లో వైసీపీ మంచి మెజారిటీలతో గెలిచింది. పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, చిత్తూరు స్థానాల్లో వైసీపీ గెలిచింది. దీంతో లక్షా 37 వేల ఓట్ల మెజారిటీతో చిత్తూరు ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. మరి ఈ సారి పరిస్తితి ఎలా ఉంది? వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉందా? అంటే పెద్దగా అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. వైసీపీకి సీన్ రివర్స్ అవుతుంది.

KPN/Kuppam Railway Station Map/Atlas SWR/South Western Zone - Railway Enquiry

అటు కుప్పంలో ఎన్ని రాజకీయాలు చేసిన..ఈ సారి బాబుకు భారీ మెజారిటీ వచ్చేలా ఉంది. ఇక పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. చిత్తూరులో కూడా టి‌డి‌పి పట్టు సాధించే ఛాన్స్ ఉంది. అయితే కుప్పంలో వచ్చే మెజారిటీ బట్టే చిత్తూరు ఎంపీ సీటుని టి‌డి‌పి కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సారి వైసీపీకి చెక్ పడటం ఫిక్స్.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp