త‌న‌కంటే 7 ఏళ్లు చిన్నోడితో మీనా రెండో పెళ్లి… ఎవ‌రా స్టార్ హీరో…!

1990వ దశకంలో నటి మీనా అంటే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక అందాల దేవత. మీనా అందం మామూలు అందం కాదు. కేవలం మీనాను చూసేందుకే అప్పట్లో చాలామంది యువకులు థియేటర్లకు వెళ్లేవారు అంటే ఆమెకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉండేదో తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో మీనా ముట్టుకుంటే మాసిపోయేంత అందంతో ఉండేది. గ్లామర్ పాత్రలు వేసినా ఏనాడు హద్దులు దాటలేదు. అటు తమిళం తో పాటు ఇటు తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ కలిసిన నటించిన మీనా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

Vidyasagar Death News: South star Meena's husband Vidyasagar dies of lung  ailment; Khushbu, Venkatesh & Sarath Kumar express grief - The Economic  Times

ముఖ్యంగా తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉండేది. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చివరకు మీనా పెళ్లి అయ్యాక కూడా వెంకటేష్ తో చేసిన దృశ్యం సిరీస్ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ? చూశాం. వెంకటేష్ అయితే తనకు జోడిగా మీనాయే కావాలని పట్టుబట్టి మరి ఆమెను పెట్టుకునే వారట. అంటే వారిద్దరి మధ్య తెరమీద ఆ రేంజ్‌లో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది.

Hit combo all set to entertain for sixth time

 

చాలా లేటు వయసులో పెళ్లి చేసుకున్న మీనా.. విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తో కలిసి ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు నైనికా అనే పాప కూడా ఉంది. అయితే గత ఏడాది జూన్ నెలలో మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. భర్తను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి చాలా త్వరగానే కొల్కుని షూటింగ్లలో పాల్గొంటుంది. రీసెంట్గా ఆమె ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Meena ᴹᴱᴱᴺᵁ's tweet - "The Blockbuster Combo Of TFI 😍😍 #Venkatesh #Meena  #HBDVictoryVenkatesh " - Trendsmap

అలాగే తమిళం తో పాటు మలయాళం లోను కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఇదిలా ఉంటే మీనా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. గత ఐదారు నెలలుగా ఈ వార్తలు ఆగలేదు. ఇంకా మీనాకు చాలా భవిష్యత్తు ఉంది. ఆమె త‌న భ‌విష్య‌త్తుతో పాటు ఇటు పాప భవిష్యత్తు కూడా చూసుకోవాలి. ఈ క్రమంలోనే ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చిన రూమర్స్ కు మాత్రం చెక్‌ పడటం లేదు.

Drushyam (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

 

తాజాగా తమిళ నటుడు బెయిల్వన్ రంగనాథన్ మీనా రెండో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనా మరికొద్ది నెలల్లో 39 ఏళ్ల పాన్ ఇండియా హీరోను వివాహం చేసుకోనుంద‌ని చెప్పడంతో ఎవరా నటుడు ? అని అందరూ చర్చించుకుంటున్నారు. మీనా వయసు 46 సంవత్సరాలు. మరి రంగనాథన్ చెప్పినదాన్ని బట్టి చూస్తే తనకంటే వయసులో ఏడు సంవత్సరాలు చిన్నోడు అయినా స్టార్ హీరోతో ఆమె రెండోసారి మూడు ముళ్ళు వేయించుకుని సరికొత్త జీవితంలోకి ఎంటర్ కాబోతుందని అర్థమవుతుంది. రంగనాథన్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు… నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుందా ? అన్నదానిపై ఆమె క్లారిటీ ఇస్తే తేలిపోతుంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, meena, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news