న‌లుగురు వైసీపీ రెబ‌ల్స్‌లో ఇద్ద‌రికి టి‌డి‌పి సీట్లు ఫిక్స్‌… ఆ ఇద్ద‌రికి డౌటే…!

మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో తేలింది. ఎలాగో లిస్ట్ లో ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇంకా మరో ఇద్దరు వచ్చి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అని వైసీపీ డిసైడ్ అయింది..అందుకే ఆ నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే టి‌డి‌పి నుంచి నలుగురు వైసీపీ వైపుకు వెళితే..ఇప్పుడు వైసీపీ నుంచి నలుగురు టి‌డి‌పిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

YSRCP legislator arrested and left out on bail for attacking a lady officer

అధికారికంగా వారి రాక ఇంకా ఫిక్స్ కాలేదు. కోటంరెడ్డి, ఆనం చేరిక దాదాపు ఖాయమని తేలిపోయింది. కాకపోతే ఎమ్మెల్యే పదవులు ఉండటంతో వారు ఎన్నికల ముందే టి‌డి‌పిలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి మేకపాటి, ఉండవల్లి సైతం టి‌డి‌పిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి టి‌డి‌పిని గెలిపించారు కాబట్టి..వీరు సైతం టి‌డి‌పిలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

వైసీపీపై ఆనం మరోసారి ఫైర్ | venkatagiri mla anam ramanarayana reddy once  again criticized the government

అయితే ఇలా వైసీపీ నుంచి వచ్చే నలుగురికి చంద్రబాబు సీట్లు ఇస్తారా? అంటే ఆ విషయం ఫిక్స్ కాలేదనే చెప్పాలి. అయితే ఆనం, కోటంరెడ్డిలకు సీట్లు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి బరిలో ఉండటం ఖాయం..ఇక ఆనం ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. మరి మేకపాటి, ఉండవల్లికి సైతం సీట్లు ఇస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి.వాస్తవానికి వీరిద్దరిపై ప్రజా వ్యతిరేకత ఉంది..అందులో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ కూడా ఈ ఇద్దరికీ నెక్ట్స్‌ సీట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయింది.

అలాంటప్పుడు బాబు వీరికి సీట్లు ఇస్తారా? లేక సీట్లు మారుస్తారా? అనేది చూడాలి. తాడికొండ సీటు మళ్ళీ శ్రీదేవికి ఇచ్చే ధైర్యం చేయకపోవచ్చు.. పైగా గుంటూరు జిల్లాలో తాడికొండ సీటు కోస‌మే టీడీపీలో గ‌ట్టి పోటీ ఉంది. అలాగే ప్ర‌త్తిపాడు, బాప‌ట్ల ఎంపీ సీట్ల‌కు కూడా టీడీపీ నుంచి మంచి డిమాండ్ ఉంది. ఇటు మేకపాటికి ఉదయగిరి సీటు ఇవ్వడం డౌటే..ఉద‌య‌గిరిలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు మ‌రో రెడ్డి నేత కూడా సీటు ఆశిస్తున్నారు. అందుకే వైసీపీ నుంచి స‌స్పెండ్ అయిన న‌లుగురు ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రికి టీడీపీ అధినేత సీట్లు ఇచ్చినా… శ్రీదేవి, చంద్ర‌శేఖ‌ర్‌కు మాత్రం క‌ష్ట‌మే అని చెప్పాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp