స‌మంత‌ను పెళ్లికూతురుగా చూసేస‌రికి క‌న్నీళ్లు ఆగ‌లేదు… శోభిత ధూళిపాళ ఇలా అనేసిందేంటి..!

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ ఇప్పటికే పుకార్లురు షికారులు చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ ఎక్కడ ?చూసినా చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల లండన్ లోని ఒక రెస్టారెంట్లో శోభిత‌ చైతన్యతో కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. సమంతకు విడాకులు ఇచ్చినప్పటి నుంచే చైతు శోభితకు దగ్గరయ్యడంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.

Sobhita Dhulipala Is Missing Dressing Up Amid Lockdown Just Like All Of Us!

అయితే దీనిపై ఇంతవరకు చైతు, శోభిత‌లో ఎవ్వ‌రూ స్పందించలేదు. మరో విషయం ఏంటంటే త్వరలోనే చైతు శోభితను పెళ్లి చేసుకుంటాడని కూడా టాలీవుడ్ లో బలంగా చర్చలు నడుస్తున్నాయి. రాజాగా శోభిత తన ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్టులు షేర్ చేసింది. మెహందీ ఫంక్షన్ ఎన్నో కొత్త ముఖాలు.. ఇప్పుడే తొలిసారిగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాము.. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు.. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా రెడీ అయ్యేందుకు నాకు తోడుగా ఉంది.. నేను తారాఖ‌న్నాలా ( మేడ్ ఇన్ హెవెన్ వెబ్‌సీరిస్‌లో శోభిత పాత్ర‌) మారిపోయి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నా.. అందుకే ముస్తాబవటానికి సమయం లేకుండా పోయింద‌ని తెలిపింది.

అయితే పెళ్లి మండపంలో సమంతను మొదటిసారి చూడగానే కన్నీళ్లు ఆగలేదు. ఇక్కడ మెహిందీ పెట్టడం కుదరలేదు.. కానీ లంచ్ మాత్రం అద్భుతంగా ఉందంటూ పెళ్లి మండపంలో ఉన్న ఫోటోలు ఆమె షేర్ చేసింది. మరో పోస్టులో సంగీత వేడుక.. నా సోదరికి డ్యాన్స్ మీద ఉన్న పిచ్చి గురించి ఎంత ?చెప్పినా తక్కువే అవుతుంది. బంధువులు, సోదరులు, స్నేహితులు ఇలా అందరూ వచ్చేసారు. ఆటపాటల మధ్యలో ర్యాగింగ్ జరుగుతుంది. సమయం చూస్తుండగానే ఉదయం 4 గంట‌లు అయింది. పార్టీ అయిపోయినా కూడా మా సందడి మాత్రం అలాగే కొనసాగిందని చెప్పింది.

6 of Sobhita Dhulipala's best on-screen performances so far | Vogue India

ఇది ఒక స్వచ్ఛమైన వేడుక.. ఎప్పటికీ మర్చిపోలేను. సంగీత్ మేము మా స్నేహితులు అంతా కూడా చెన్నైలో సంధానతో పాట‌కు డ్యాన్స్ చేసాం అని రాసుకు వచ్చింది. ఈ కామెంట్ చూసిన నెటిజనులు ఇది వెబ్‌సీరిస్‌ షూటింగా ? లేదంటే నిజంగానే ఎవరిది అయినా పెళ్లి జరిగిందా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. మరి శోభిత ట్యాగ్ చేసిన సమంత అకౌంట్ వివరాలు చూస్తుంటే ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. ఆమె పెళ్లి విశేషాలనే శోభిత షేర్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక స‌మంత‌ను పెళ్లి కూతురుగా చూడ‌డంతో ఏడ్చేశాన‌ని శోభిత అన్న టైటిల్ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Samantha, shobitha, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news