మ‌ళ్లీ మాజీ ప్రియుడిపై మోజు ప‌డుతోన్న స‌మంత‌…. ఏం చేసిందో తెలుసా…!

సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్ సమంత ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటూ పోతోంది. రీసెంట్‌గా శాకుంత‌లం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఖుషి సినిమా చేస్తోంది. ఇక యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా మ‌రో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అలాగే సిటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్ వెబ్ సీరిస్‌లో కూడా న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

When Siddharth and Samantha performed special pooja at Kalahasthi for their  rumoured marriage [Throwback] - Photos,Images,Gallery - 109901

ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. త‌న మాజి ప్రియుడు సిద్ధార్థ్‌కు జోడీగా కూడా ఓ సినిమాలో న‌టించేందుకు స‌మంత గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిందంటున్నారు. అస‌లు నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌కు ముందు స‌మంత‌, సిద్ధు ప్రేమ‌లో ప‌డ్డారు. ఇంకా చెప్పాలంటే ఏమాయ చేశావే సినిమా త‌ర్వాతే సిద్ధు – స‌మంత ప్రేమాయ‌ణం పీక్స్ స్టేజ్‌కు చేరుకుంది.

Siddharth wages Twitter war against Samantha | Siddharth | ‪Samantha Ruth  Prabhu‬ | Breakup | Twitter | Gossips

ఇద్ద‌రూ క‌లిసి గుడిలో క‌లిసే రాహుకేతు పూజ‌లు కూడా చేశార‌ని అన్నారు. ఈ ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఎక్క‌డ చూసినా ఇద్ద‌రూ క‌లిసే తిరిగే వారు. స‌మంత స‌డెన్‌గా సిద్ధ‌కు హ్యాండ్ ఇచ్చి చై వ‌ల‌లో ప‌డిపోయింది. చైతుతో ప్రేమ‌, పెళ్లి.. ఇప్పుడు విడాకులు కూడా అయిపోయాయి. విడాకుల త‌ర్వాత సిద్ధు – సామ్ మ‌ధ్య మాట‌ల తూటాలే పేలాయి.

Samantha To Get Married | Samantha Upcoming Plans | Samantha Siddharth |  Siddharth Samantha | Latest News Samantha - Filmibeat

ఇలాంటి టైంలో ఇప్పుడు సామ్‌.. త‌న మాజీ భ‌ర్త చైత‌న్య‌పై తీవ్రంగా విరుచుకు ప‌డుతోంది. స‌డెన్‌గా ఇప్పుడు చైతుపై కోపంతోనే ఇష్టం వ‌చ్చిన‌ట్టు సినిమాలు ఒప్పుకుంటూ.. విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోస్తోంద‌ని కూడా అంటున్నారు. ఈ టైంలో ఆమె మ‌ళ్లీ త‌న మాజీ ల‌వ‌ర్ సిద్ధార్థ్‌తో సినిమాకు ఓకే చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే సిద్ధుపై ప్రేమ‌కంటే… చైపై ఉన్న కోప‌మే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.