చిరంజీవికి ఆ ముగ్గురు హీరోయిన్ల‌తో ఎఫైర్లు… ఎవ‌రా ముగ్గురు…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా ఉంటున్నారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వెళుతున్నారు. అయితే ఈ వయసులోనూ చిరు తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన స్థానాన్ని అందుకోవటం ఏ హీరోకు సాధ్యం కావడం లేదు అంటే చిరంజీవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా చెరగని ముద్ర వేసుకున్నారో అర్ధమవుతుంది. క్లాస్, మాస్ తేడా లేకుండా చిరంజీవికి అన్ని వర్గాలలోను అభిమానులు ఉన్నారు.

Abhilasha Songs - Sandhe Poddula Kaada - Chiranjeevi Songs - Chiranjeevi,  Radhika Sarathkumar - video Dailymotion

నవరసాల్లో ఏ రసమైనా చిరంజీవి అలవోకగా పండించేస్తారు. ఇక డ్యాన్స్‌ల్లో అయితే చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా రంగానికే డ్యాన్సుల్లో సరికొత్త ఒరవ‌డి నేర్పిన ఘనత చిరుదే. చిరంజీవి తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు. అయితే ముగ్గురు హీరోయిన్లతో ఆయన ఎక్కువగా సినిమాలు చేశారు. విచిత్రం ఏమిటంటే ఆ ముగ్గురు హీరోయిన్లతో ఆయనకు ఎఫైర్లు ఉన్నట్టు 1980వ దశకంలో వార్తలు పుకార్లు షికార్లు చేశాయి.

Donga Movie Songs - Donga Donga - Chiranjeevi Radha - YouTube

ఆ హీరోయిన్లు ఎవరో కాదు రాధిక, రాధా, మాధవి. ఈ ముగ్గురు హీరోయిన్లతో చిరంజీవికి మంచి హిట్లు పడ్డాయి. మాధ‌వితో కలిసి చేసిన ఖైదీ సినిమా చిరంజీవిని టాలీవుడ్ లో తిరిగిలేని మెగాస్టార్ గా నిలబెట్టింది. మాధ‌వి – చిరు సాన్నిహిత్యం అప్ప‌ట్లో ఓ సెన్షేష‌న్‌. ఇక రాధా – చిరంజీవి కాంబినేషన్ అంటే ఒక క్రేజీ కాంబినేషన్. చిరంజీవితో పోటీపడి డ్యాన్స్ చేయాలంటే రాధ మాత్రమే పోటీ ఇస్తుంది.. అంత గొప్పగా నటించేది.

Rana Ek Don |Chiranjeevi , Madhavi | South Dubbed Romantic and Action Movie  in Hindi - YouTube

చిరంజీవితో నటించడం అంటే రాధ‌ పడి చచ్చేదన్న పేరు అప్పట్లో ఉండేది. ఇక రాధికా – చిరంజీవి కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. రాధిక – చిరంజీవి షూటింగ్ అయిపోయాక కూడా మద్రాస్ బీచ్ లో కలిసి కనిపించే వారట. ఏది ఏమైనా అప్పట్లో తమిళ పత్రికలు ఈ ముగ్గురు హీరోయిన్లతో చిరంజీవికి ఎఫైర్లు ఉన్నట్టు బాగా వార్తలు రాసేవి. చివరకు ఆ పత్రికల టార్చర్ తట్టుకోలేక చిరంజీవి తన భార్య సురేఖనే స్వయంగా షూటింగ్ లోకేషన్ కు తీసుకు వెళ్లే వాడిని కూడా అంటూ ఉంటారు.

Tags: chiranjeevi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news