బాలీవుడ్ హాట్ ఆంటీ మలైకా అరోరా ఇంతమందితో ఎఫైర్లు నడిపిందా… ఆ హీరో కూడా ఉన్నాడా..!

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ అనే చిత్రంలో “కెవ్వు కేక” అంటూ స్టెప్పు లేసి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన టువంటి ముంబై బ్యూటీ మలైకా అరోరా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎక్కువగా తన సినిమాల కంటే కూడా ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత ప్రేమాయణాల గురించి వార్తల్లో నిలుస్తోంది. మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి సింపుల్గా ముగింపు చెప్పేసింది.

 

తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఎం చ‌క్క‌గా చట్టపట్టలేసుకుని సహజీవనం చేస్తోంది. 1998 డిసెంబర్‌లో మలైకా, అర్బాజ్ పెళ్లి చేసుకున్నారు. 19 సంవత్సరాల తర్వాత 2017లో వీరు తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు.. విడాకులు తర్వాత మలైకా- అర్జున్ కపూర్ తోను అర్బాజ్- జార్జియా ఆండ్రియాతోను రిలేషన్ లో ఉన్నారు. మ‌లైకా – అర్బాజ్ దంపతులకు 19 ఏళ్ల కుమారుడు అర్హన్ ఖాన్ కూడా ఉన్నాడు. కుమారుడి బాధ్యత నెరవేర్చే విషయంలో మ‌లైకా – అర్బాజ్ కలిసికట్టుగానే ఉంటున్నారు.

 

గ‌తంలో జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో మ‌లైకా మాట్లాడుతూ.. తను ఇప్పటికీ తన మాజీ భర్తతో టచ్ లో ఉన్నానని.. అర్బాజ్ చాలా మంచి వ్యక్తి… అతడు బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఈ ఇద్ద‌రు చాలా మంచి వాళ్లే అయినా కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చు అని… తమ దాంపత్య జీవితంలోను అదే జరిగిందని వెల్లడించింది.ఇక తన కుమారుడితో తనకి మంచి అనుబంధమే ఉందని చెప్పింది. అర్బాజ్ తో పెళ్లికి ముందే ఒకటి రెండు ఎఫైర్లు పెట్టుకున్న మలైకా.. ఆ తర్వాత మరో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తో కూడా కొంతకాలం క‌థ‌ నడిపిందన్న గాసిప్పులు అయితే ఉన్నాయి.