రాజశేఖర్‌కు స్టార్‌డం తెచ్చిన సినిమా వెన‌క బాల‌య్య‌..!

టాలీవుడ్‌లో ఒక హీరో చేయాల్సిన సినిమా కోన్ని కార‌ణాల‌తో మ‌రో హీరో చేయాటం మామూలే.. ఇలా ఒక హీరో వ‌దులుకున్న సినిమాను మ‌రో హీరో చేసిన్న‌ప్పుడు ఆ సినిమా హిట్ లేదా ఫ్లాప్ అవుతుంటుంది. ఒక హీరో వ‌దులుకున్న సినిమాతో మ‌రో హీరో హిట్ కొడితే ఆ క‌థ‌ను వ‌దులుకున్న హీరో అభిమానులు కాస్త ఫీల‌వుతూ ఉంటారు. యాంగ్రీ యంగ‌మేన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలో వ‌చ్చిన సింహ‌రాశి సినిమా రాజశేఖ‌ర్‌ను ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది.

Simharasi Full Length Telugu Movie || Rajasekhar, Saakshi Sivanand || Ganesh Videos DVD Rip.. - YouTube

సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఆర్‌.బి చౌద‌రి నిర్మించిన ఈ సినిమాను వీ.స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతేకాకుండా సినిమా కథతో బాలకృష్ణ దగ్గరికి వెళ్లి ఈ చిత్రం చేయాలని కోరారట. బాలకృష్ణ అప్పటికే సమరసింహా రెడ్డితో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. దాంతో సింహరాశి లాంటి సినిమాలో ఇప్పుడు నటించడం కరెక్ట్ కాదేమోనని బాలయ్య భావించి తాను చేయనని చెప్పేసారు.

అంతేకాకుండా బాలకృష్ణ చెన్న‌కేశ‌రెడ్డి సినిమా క‌థ‌ను డైరెక్ట్ చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ను కోరార‌ట‌
సింహ‌రాశి మ‌రి సెంటిమెంట‌ల్ సినిమా అని చెన్న‌కేశ‌రెడ్డి సినిమా త‌న‌తో చేయాల‌ని స‌ముద్ర‌ని బాల‌య్య కోరిన ఆయన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Watch Chennakesava Reddy | Prime Video

అలా స‌ముద్ర బాల‌య్య కాంబోలో రావ‌ల‌సిన సింహ‌రాశి సినిమాలో త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ వ‌చ్చి చేరారు. 2001 లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో పాటు రాజ‌శేఖ‌ర్ కెరీర్‌కు మంచి ఉపును ఇచ్చింది. సాక్షి శివానంద్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.అ త‌ర్వాత బాల‌య్య‌తో మ‌రో సినిమా చేసేందుకు స‌ముద్ర ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన సాధ్యం కాలేద‌ని అయ‌నే చెప్పారు. ఇక ఈ విధంగా రాజశేఖర్ కెరియర్ కు బాలయ్య హెల్ప్ అయ్యాడు