కోట్ల ఆస్తి ఉన్న లయ..అమెరికాలో ఎందుకు జాబ్‌ చేస్తుందో తెలుసా.. ఆమె నెల జీతం తెలిస్తే మైండ్‌బ్లాకే..!!

లయ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. “స్వయంవరం” అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లయ తను నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చాలామంది అగ్ర హీరోలతో హిట్ సినిమాల్లో నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. లయ కెరియర్ మంచి ఫామ్ లో ఉండే టైం లోనే యూఎస్ఏ లో ఒక డాక్టర్ అయినా గణేష్ గోర్తిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయింది.

దాంతో సినీ కెరీర్ కు దూరం అవ్వాల్సి వచ్చింది లయ. ల‌య‌కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హస్బెండ్ ఒక టాప్ డాక్టర్.. అతనికి అమెరికాలో మూడు హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే లయ కుటుంబానికి కూడా చాలా ఆస్తి పాస్తులు ఉన్నాయి. అయినప్పటికీ లయ ఒక టాప్ య‌మ్ య‌న్ సి కంపెనీలో సాఫ్ట్ వేర్ గా జాబ్ చేసింది. కొన్ని పర్సనల్ రీజన్స్ తో జాబ్ కు కొంతకాలం దూరంగా ఉన్న లయ ప్రస్తుతం మరో జాబ్ లో ఎంట్రీ ఇచ్చింది.

actress laya Latest News in Telugu, తెలుగు తాజా వార్తలు, actress laya Top Headline, Trending News, Photos, Videos Online | Hashtagu Telugu

జోబి ఏవియేషన్ అనే ఇన్స్టిట్యూట్లో లయ ప్రస్తుతం వర్క్ చేస్తుంది. ఈ ఎయిర్ బస్ ఇన్స్టిట్యూట్ లో లయ ఒక ప్రాధాన్యమైన పోస్టులో జాబ్ చేస్తుందట. ల‌య‌ ఇటీవల ఆ జాబ్ లో ఎంప్లాయ్ గా చేస్తున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే లయ ఉద్యోగం ద్వారా నెలకు 10 లక్షలకు పైగా సంపాదిస్తుందట. దీంతోపాటు లయ సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తులు కాక ప్రస్తుతం తన భర్త బిజినెస్ లు, హాస్పిటల్స్ కి సంబంధించిన లావాదేవీలను కూడా తనే స్వయంగా చూసుకుంటుందట. ఏది ఏమైనా సరే లయ పెళ్లి తరువాత చాలా చలాకీగా మారిపోయింది.. ఓ వైపు కుటుంబం ..మరో వైపు బిజినెస్..మరో వైపు జాబ్ చేస్తూ..ఆల్ రౌండర్ అనిపించుకుంటుంది. త్వరలోనే లయ కూతురు కూడా సినిమాలోకి రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!