కృతి శెట్టి పూజలు ఫిలించాయ్..ఒక్క ఫోన్ కాల్ తో.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందోచ్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ కృతిశెట్టి లైఫ్ టర్న్ అయ్యే ఛాన్స్ వచ్చిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు .ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో కృతి కి అవకాశం వస్తుందో రాదో ..అంటూ భయపడిన వాళ్లకి పండగ చేసుకునే విధంగా ఉండే న్యూస్ లీకై సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మనకు తెలిసిందే ప్రెసెంట్ కృతి శెట్టి కెరియర్ ఎలాంటి టఫ్ సిచువేషన్ లో ఉందో..

ఫస్ట్ నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వగా .. ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే అమ్మడు తన ఆశలన్నీ నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న కస్టడీ సినిమా పైన పెట్టుకుని ఉంది . అఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అయినా సరే.. పూర్తిగా కృతి శెట్టి కెరియర్ బాగుపడుతుందని చెప్పలేము.. ఎందుకంటే నాగచైతన్య కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి కష్టపడుతున్నారు. ఈ సినిమా హిట్ అయినా సగం సక్సెస్ చైతన్యకి సగం సక్సెస్ కృతి శెట్టికి దక్కుతుంది.

 

ఇక ఆ తర్వాత శర్వానంద్ తో నటిస్తున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఈ క్రమంలోనే అమ్మడికి అదిరిపోయే ఆఫర్ తలుపు తట్టింది . సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కృతి శెట్టి సెలెక్ట్ అయినట్టు న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ల పై కూడా కృతి శెట్టి సైన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయిపోయింది.

దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే రీసెంట్ గానే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా మరదలు పాత్ర కోసం కృతిశెట్టిని సెలెక్ట్ చేశారని ఈ పాత్రకు ట్రెడిషనల్ లుక్స్ ఉండడం ఇంపార్టెంట్ అంటూ అందుకే సెకండ్ పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్స్ ని ట్రై చేసి ఫైనల్ గా కృతి ని ఓకే చేశారంటూ తెలుస్తుంది . అంతేకాదు రెండు రోజుల క్రితమే కొరటాల శివ దీనిపై అఫీషియల్ గా కృతి శెట్టికి కన్ఫర్మ్ చేస్తూ ఫోన్ కాల్ తో క్లారిటీ ఇచ్చాడు అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్న కృతశెట్టికి ఇలాంటి ఆఫర్ రావడం అంటే జాక్ పాట్ కొట్టినట్లేగా అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, Krithi Shetty, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news