యాక్షన్ కింగ్ అర్జున్ గురించి సౌత్ ఇండియాన్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా అర్జున్‌కు మంచి పాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య ఇప్పటికే తమిళంతో పాటు కన్నడంలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఆమె నటించిన సినిమాలో తెలుగులో కూడా వచ్చాయి. ఇక ఆమె తెలుగులో డైరెక్టుగా చేయాల్సిన సినిమా మత్రం మధ్యలోనే అగిపోయింది.
ఈ క్రమంలోనే ఐశ్వర్య గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐశ్వర్య త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది. యక్షన్ కింగ్ అర్జున్ త్వరలోనే మామగారు కాబోతున్నారు. ఇక పెళ్లి కొడుకు కూడా సినీ నేపథ్యం ఉన్న వాడే కావడం విశేషం. ఇక ఐశ్వర్య కాబోయే భర్త ఎవరో ? కాదు కోలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడైన తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అన్ని ప్రచారం అన్ని తెలుస్తుంది. వీద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని సమాచారం.
ఐశ్వర్య, ఉమాపతి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని సమాచారం. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు.. త్వరలోనే ఇరు కుటుంబాల సంమక్షంలో వీరిరు పెళ్లి ఎంతో ఘనంగా జరగనుంది అని తెలుస్తోంది. ఇటు ఐశ్వర్య, ఉమాపతి సినీ కేరీర్ కూడా అంత ఆశాజనకంగా లేదు. తమిళంలో అప్పుడప్పుడు సినిమాలు చేసే ఐశ్వర్య..టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
ఈ సినిమా ప్రారంభం జరిగి కూడా అగిపోయింది. అటూ ఉమాపతి నాలుగు సినిమాలు చేసిన అంతగా నిలదొక్కుకోలేకపోయాడు. అయితే వీరిద్దరూ ఎక్కడ ? కలిశారు వీరి పరిచయం ఎక్కడ జరిగింది. అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక తంబిరామయ్యకు కోలీవుడ్ లో మంచి కమెడియన్‌గా పేరు ఉంది. ఏది ఏమైనా స్టార్ హీరోగా ఉన్న అర్జున్ కు తన కూతుర్ని కూడా సినిమా వాళ్ళ ఇంటికి కోడలిగా చేస్తున్నాడు.