చ‌ర‌ణ్ తండ్ర‌య్యాడు… ఇప్పుడు చ‌ర‌ణ్ ప్రియురాలు కూడా త‌ల్లి అవుతోందా…!

ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఇదే చర్చ సాగుతోంది. అక్క‌డ ఓ స్టార్ హీరోయిన్ త‌ల్లి కాబోతోంది. ఆమె తాను ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది. దీనికి కార‌ణం ఆ స్టార్ హీరోయిన్ బేబీ బంప్ తో కనిపించడమే. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు కియారా అద్వానీ. తన కొత్త సినిమా ప్రచారం కోసం జైపుర్ వెళ్లింది కియరా. హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి అక్క‌డ‌ ఫొటోలకు పోజులిచ్చింది. అలా దిగిన ఫొటోల్లో ఆమె చిన్నపాటి గర్భం ఉన్న‌ట్టు ప‌లువురు సందేహిస్తున్నారు.

దీంతో ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా వారు క‌థ‌నాలు అల్లేస్తున్నారు. ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందా ? లేదా ? ఆమె వేసుకున్న డ్రెస్ వ‌ల్ల అలా క‌నిపించిందా ? అన్న‌ది అర్థం కావ‌ట్లేదు. ఇక బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఉన్న సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది కియరా అద్వానీ. అలియాభట్ టైపులోనే ఆమె కూడా వెంట‌నే ప్రెగ్నెన్సీ ధరించింద‌ని కొంద‌రు సందేహిస్తున్నారు.

ఒక‌వేళ కియారా నిజంగా గర్భం దాలిస్తే ఆ విషయాన్ని ఆమె బయటపెట్టడానికి ఏమాత్రం సందేహ ప‌డ‌దు. అయితే ఇందులో నిజం ఉండే అవ‌కాశం త‌క్కువే అంటున్నారు చాలా మంది. ఒక‌వేళ ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న గేమ్‌ఛేంజ‌ర్ సినిమాలో ఆమె హీరోయిన్‌.

ఇంత‌కు ముందే కియారా తెలుగులో మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనేనేను, రామ్‌చ‌ర‌ణ్ విన‌య‌విధ‌య రామ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా అవుతుంది. ఇటీవ‌లే చ‌ర‌ణ్ ఓ బిడ్డ‌కు తండ్రి కాగా.. ఇప్పుడు త‌న సినిమా ల‌వ‌ర్ కూడా హీరోయిన్