బాలయ్య – తొట్టెంపూడి వేణు మధ్య ఉన్న‌ బంధుత్వం ఇది… వీరిద్ద‌రు వ‌రుస‌కు ఏమ‌వుతారంటే..!

హీరో వేణు తొట్టెం పూడి..తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో వేణు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు.

ఇక రీసెంట్‌గా మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక వేణుకు చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాకుండా ఎంద‌రో రాజకీయ నాయకులతో కూడా దగ్గర బంధుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వేణుకు స్వయానా బావ. అంతేకాకుండా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బి గోపాల్ వేణుకు మేనమామ అవుతాడు.

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా వేణుకు పెదనాన్న వరుస అవుతాడు. అలాగే మ‌రో మాజీ ఎంపీ మాగంటి అంకినీడు కూడా వేణుకు బంధువే. ఇలా వేణుకు రాజ‌కీయంగా కూడా బ‌ల‌మైన బంధుత్వం ఉంది. ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ- వేణు మధ్య కూడా ఎంతో దగ్గర బంధుత్వం ఉంది అనే విషయం చాలామందికి తెలియదు.

సలు బాలయ్య-మధ్య ఎలాంటి బంధుత్వం ఉందో ఇప్పుడు చూద్దాం.కావూరి సాంబశివరావు మనవడు మెతుకుమిల్లి శ్రీ భరత్..బాలయ్య చిన్న కూతురు తేజ‌స్వినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ లెక్కన బాలయ్య వేణుకు వరుసకు అన్నయ్య అవుతారు. ఇదీ బాలయ్య, వేణు తొట్టెంపూడికి మధ్య ఉన్న బంధుత్వం.