ప‌వ‌న్‌కు ఆ హీరోయిన్‌కు ఎక్క‌డ ? చెడింది.. ఖుషి సినిమా టైటిల్ ఎందుకు మారింది..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో ఖుషి కూడా ఒక‌టి. ప‌వ‌న్ కెరీర్‌లో తొలిప్రేమ త‌ర్వాత ఆ రేంజ్ హిట్‌ మూవీగా నిలిచిన ఖుషి సినిమా గురించి ఎవ‌రికి తెలియ‌ని కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఉన్నాయి. ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ భూమిక కాదు. అమీషా ప‌టేల్‌. ఆమె అంత‌కు ముందే ప‌వ‌న్‌కు జోడీగా బ‌ద్రి సినిమాలో న‌టించింది. ఆ సినిమా హిట్ కావ‌డంతో ప‌వనే స్వ‌యంగా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అమీషాను ఖుషిలో హీరోయిన్‌గా రిక‌మెండ్ చేశారు.

Prime Video: Kushi

శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్ పై అప్ప‌ట్లో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు ఇచ్చిన‌ నిర్మాత ఏఎం. ర‌త్నం ఈ సినిమాను నిర్మించారు. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌జె. సూర్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఖుషి సినిమాకు ముందు అనుకున్న పేరు చెప్పాల‌ని ఉంది. ఇదే పేరుతో క్లాప్ బోర్డ్ కొట్టారు. అమీషా ప‌టేల్‌నే హీరోయిన్‌గా అనుకుని ఆమెతోనే ఫ‌స్ట్ సీన్ తీశారు. ముందుగా న‌డుము సీన్ తీశాడు సూర్య‌.

ఆ షాట్ చూసి అక్క‌డే ఉన్న అప్ప‌టి హోం మంత్రి దేవేంద‌ర్ గౌడ్‌తో పాటు హీరో వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తండ్రి వెంక‌ట్రావు చ‌ప్ప‌ట్లు కొట్టి అదిరిపోయింద‌ని ప్ర‌శంసించారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌కు, అమీషాకు మ‌ధ్య షూటింగ్‌లో ఏదో గ్యాప్ వ‌చ్చింది. ప‌వ‌న్ కాంప్ర‌మైజ్ కాలేదు. ఆమెను త‌ప్పించే వ‌ర‌కు వ‌చ్చేసింది. చివ‌ర‌కు అప్ప‌టికే సుమంత్ స‌ర‌స‌న యువ‌కుడు సినిమాలో న‌టించిన భూమిక‌ను హీరోయిన్‌గా తీసుకుని అమీషాను త‌ప్పించేశారు.

ఇక టైటిల్ కూడా మారిపోయింది. చెప్పాల‌ని ఉంది ప్లేసులో ఖుషి అని పెట్టారు. ఈ టైటిల్ మార్చింది కూడా ప‌వ‌నే. ఇక సినిమాలో కొన్ని సీన్ల‌తో పాటు యాక్ష‌న్ సీన్లు సైతం స్వ‌యంగా ప‌వ‌నే కంపోజ్ చేసుకున్నారు. చివ‌ర‌కు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాతో ప‌వ‌న్‌కు యూత్‌లో తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, pawan kalyam, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news