వామ్మో..ఐశ్వర్యరాయ్ ఆస్తులు ఎన్ని వేల కోట్లా..? ఒక్కో సినిమాకి ఎంత పుచ్చుకుంటుందో తెలుసా..?

ఒకప్పటి ప్రపంచ సుందరి.. అందంతో.. త‌న‌ కళ్ళతో మనసు దోచుకునే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరు. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్యరాయ్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి హీరోయిన్ గా రాణించింది.. ఈమె నటించిన సినిమాలో సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గాన్‌గా ఓ వెలుగు వెలిగింది.. అదేవిధంగా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో హిట్ సినిమాలులో నటించి మెప్పించింది.

Aishwarya Rai Bachchan at Cannes 2015 | Bollywood News – India TV

స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఆపై ఆరాధ్యకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించారు. ఫ్యామిలీ, కూతురు ఆద్యకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ బ‌చ్చ‌న్‌.. ఇటీవలే వచ్చిన పొన్నియన్ సెల్వన్2 సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతగానో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్రముఖ కోలివుడ్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

aishwarya rai bachchan movies that prove she's the ultimate diva |  Filmfare.com

అయితే ఇప్పుడు ఐశ్వర్యారాయ్ ఆస్తుల వ్యాల్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక మరి ఐశ్వర్యారాయ్ ఆస్తులు విలువ ఎన్ని వేల కోట్ల అనేది ఇప్పుడు చూద్దాం. 1997 నుంచి సిని కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇక ఐశ్వర్యారాయ్ ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ 100 మిలియన్ డాలర్ల (టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం రూ. 776 కోట్లు) నికర విలువతో కూడిన ఆస్తులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.

Aishwarya Rai Bachchan wasn't allowed entry inside the Indian Pavilion at  Cannes 2015! - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at  Bollywoodlife.com

దుబాయ్ సానిటరీ ఫాల్స్ లోనే ఆమెకు విలాసవంతమైన విల్లా ఉంది. ఇక ఐశ్వర్య కాస్ల్టీ ఆభరణాలు కూడా ధరిస్తుందని టాక్. ఆమె వేసుకున్న నగల విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం. కేవలం ఇయర్ రింగ్స్ విలువ రూ.70లక్షల రూపాయలు ఉంటుందట. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పొందే భారతీయ నటీమణులలో ఒకరిగా ఐశ్వర్యారాయ్ పేరు మార్మోగింది. ఆమె పాత్ర నిడివిని బట్టి ప్రతి సినిమాకు రూ. 10- రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

aishwarya rai bachchan in green body suit, 28 साल पहले जब स्विमसूट पहनी  ऐश्वर्या राय बच्चन की तस्वीरें हो गई थीं वायरल, खूबसूरती देख मच गया था  हल्ला - when aishwarya rai

ఐశ్వర్య రాయ్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆమె తరగని అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ ఆస్తిల‌ విలువ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఐశ్వర్యరాయ్ పేరు మీదే ఇన్ని ఆస్తులు ఉంటే మరి అభిషేక్ బచ్చన్ మీద ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయో అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.