సమ‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టించిన ఈ అమ్మాయి రామ్‌చ‌ర‌ణ్‌కు ఏమ‌వుతుందో తెలుసా..!

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నా అందులో స‌మ‌ర‌సింహారెడ్డి ఎప్ప‌ట‌కీ స్పెష‌ల్‌. తెలుగు సినిమా చ‌రిత్ర పాత రికార్డుల‌ను తిర‌గ‌రాసి ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 30కు పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఫ్యాక్ష‌న్ చిత్రాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది కూడా ఈ సినిమాయే.

ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య మ‌రో ప‌దేళ్ల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందాడు. ఈ సినిమాలో సిమ్రాన్‌, అంజ‌లా ఝ‌వేరి, ర‌వ‌ళి హీరోయిన్లుగా న‌టించారు. బాల‌య్య త‌న చెల్లెళ్ల కోసం బాలయ్య పడే తపన ప్రతి ఒక్కరికి క‌న్నీళ్లు తెప్పించింది. ఈ సినిమాలో చెల్లెళ్లలో బాలయ్య చిన్న చెల్లె ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్‌డ్ పాత్ర‌లో న‌టించిన ఈ అమ్మాయి పేరు స‌హ‌స్ర‌.

చిన్న వ‌య‌స్సులోనే సినిమాల్లోకి వ‌చ్చిన స‌హ‌స్ర ఆ త‌ర్వాత చ‌దువు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఉన్న‌త చ‌దువుల‌కు వెళ్లిపోయింది. సమరసింహారెడ్డినే సహస్ర ఆఖరి సినిమా.. ప్ర‌స్తుతం ఆమె బిజినెస్‌లో బాగా రాణిస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఆమె ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే మెగాఫ్యామిలీతో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి చెప్పింది.

చిన్న‌ప్పుడు నేను చాలా ముద్దుగా ఉండ‌డంతో అంద‌రూ బాగా చూసుకునేవార‌ని.. చిరంజీవి గారితో రౌడీ అల్లుడు అనే సినిమాలో నటించిన‌ప్పుడు ఓ రోజు ఆయ‌న వాళ్ల ఇంటికి తీసుకువెళ్లార‌ని గుర్తు చేసుకుంది. అప్పుడు అక్క‌డ రామ్‌చ‌ర‌ణ్‌కు ఎంతో ఇష్ట‌మైన టెడ్డీబేర్ క‌నిపించ‌డంతో దాంతో ఆడుకుంటూనే ఉండేదానిని అని… చెర్రీనాకు చిన్నప్పుడు మంచి స్నేహితుడు…. ఇప్పటికీ త‌మ స్నేహం అలాగే కొన‌సాగుతోంద‌ని.. అప్పుడ‌ప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటామ‌ని చెప్పింది.