ఏపీలో డ్రైవింగ్ చేస్తూ ఇయ‌ర్ ఫోన్స్ పెట్ట‌కుంటే రు. 20 వేలు దూలే..!

ఏపీలో అధికార వైసీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఎన్నెన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో షాకింగ్ నిర్ణ‌యంతో వాహ‌న‌దారుల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక‌పై ఏపీలో ఎవ‌రైనా డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధిస్తారు. ఈ జ‌రిమానాలు ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇకపై వాహ‌న‌దారులు ఎవ‌రైనా బైక్ మీద కానీ కారులో కానీ.. ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి.