భోజ‌నం చేశాక ఎంత టైంలో మందులు వేసుకోవాలి… ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్‌..!

వర్షాకాలం మొదలవ్వగానే జ్వరం, జలుబు, దగ్గు, వస్తూ ఉంటాయి. అనారోగ్యం భారిన పడినప్పుడు కోలుకునేందుకు రోగులు హాస్పటల్ కి వెళతారు. ఆరోగ్యం సరవ్వడానికి డాక్టర్ మందులు రాస్తారు. వీటిని ఏ టైంకు ఎలా ? వేసుకోవాలో కూడా చెపుతారు. కానీ చాలామంది రోగులు భోజ‌నం లేదా టిఫిన్‌ తిన్న వెంటనే టాబ్లెట్ వేసుకుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం.

భోజనం తిన్న వెంటనే మాత్రలు వేసుకోకూడద‌ట‌. ఎందుకంటే ఇది మ‌న‌ శరీరంలో వేడి పెంచుతుంద‌ట‌. భోజనం చేసిన వెంటనే మాత్ర‌లు తీసుకోవడం వల్ల‌ శరీరంలో రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది.. ఇది మ‌న‌ ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల‌ భోజనం చేసిన 1 గంట తరువాత మాత్రలు వేసుకోవడం మంచిది. అలాగే స్త్రీలు గర్భనిరోధ‌క మాత్ర‌లు వేసుకుంటున్నప్పుడు భోజనం చేసిన 2 గంటల తర్వాత వాటిని వేసుకోవాలి. ఇలా మీరు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మందులు వాడితే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.