ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతి రావు కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ న‌టుడు, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతిరావు క‌న్నుమూసారు. టాలీవుడ్‌లో  మోస్ట్ పాపుల‌ర్ న‌టుడిగా గుర్తింపు ఉన్న గొల్ల‌పూడి మారుతిరావు చ‌నిపోవ‌డం సిని లోకానికి తీర‌ని లోటుగా చెప్ప‌వ‌చ్చు. గొల్ల‌పూడి గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిర‌ప‌రిచితుడైన న‌టుడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న చికిత్స కోసం ఆస్ప‌త్రిలో చేరారు. అయితే గుండెపోటు రావ‌డంతో ఆస్ప‌త్రిలోనే క‌న్నుమూసారు.

గుండెపూడి మారుతి రావు 14, ఏప్రిల్ 1939లో విజ‌య‌న‌గ‌రంలో జ‌న్మించారు. మారుతి రావు రైటర్ గా, నటుడు గా ఈయన చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. 13 ఏళ్ళ వయస్సులోనే ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేశారు. 250 కు పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈయన 6 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో విలన్ మరియు సహా నటుడి పాత్రలు పోషించారు. చిరంజీవి గారితో ఈయనకి మంచి సాన్నిహిత్యం ఉంది.

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఇజం లో ఈయన కనిపించారు. అలాగే ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన జోడి ఈయనకి చివరి చిత్రమని చెప్పాలి. ప్రేమ పుస్తకం చిత్రానికి గాను గొల్లపూడి మారుతీరావు మొదటి నంది అవార్డును అందుకొన్నారు. గొల్ల‌పూడి జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. గొల్ల‌పూడి ఎన్నో మధుమ‌రైన ర‌చ‌న‌లు చేశారు. ఇంట్లో రామ‌య్య వీధీలో కృష్ణ‌య్య అనే సినిమాతో సిని ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. సినిమాల‌కు రాక‌ముందు రెడియోలో ప‌నిచేశారు. గొల్ల‌పూడి మృతిప‌ట్ల చిత్ర పరిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

Tags: died, Gollapudi MaruthiRao, Tollywood