బియ్యం కడిగిన నీటితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…..!!

ఆసియాలో రైస్ ని ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తారు అన్న విషయం మనకు తెలిసిందే. రైస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది అన్నం ఉడికిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే గంజిని కూడా తాగుతారు. పూర్వం రోజుల్లో పెద్దవారు ఇలా గంజిని ఎక్కువగా తాగేవారు. అయితే రైస్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైస్ వాటర్ అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.

రైస్ అందానికి ఏ విధంగా ఉపయోగపడదు ఇప్పుడు చూద్దాం. రైస్ వాటర్ తయారు చేయడం చాలా సులభం. దీనికి మీకు కావాల్సినవి బియ్యం, నీరు, ఆఫ్ గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి అరగంట నానబెట్టి ఒకసారి చేత్తో మొత్తం తిప్పి ఆ నీటిని వడకట్టి ఎయిర్ ట్తెట్ కంటైనర్లు పోసి ఫ్రిజ్లో పెట్టాలి. ఈ నీరు ఫ్రిజ్లో వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ నీటిని ఐస్ క్యూబ్ ట్రే లో పోస్తే రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి.

కొంత రైస్ వాటర్ తీసుకొని ఫేస్ అంతా రఫ్ చేయాలి. రప్‌ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది. రైస్ వాటర్ అద్భుతమైన గ్లో ఇస్తుంది. ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్, పింపుల్స్, డస్ట్ లాంటివి పోతాయి. కొరియన్ వాళ్లు ఎక్కువగా రైస్ వాటర్, రైస్ వాటర్ క్రీమ్స్, ఆయిల్మెంట్స్ లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళ ఫేస్ మీద ఎటువంటి డిస్టబెన్స్ ఉండవు. రైస్ వాటర్ ఫేస్ కి అప్లై చేయడం వల్ల చాలా స్మూత్ గా అవుతుంది. ఇలా వారం పాటు డైలీ చేసినట్లయితే డిఫరెంట్ తెలుస్తుంది.