ఈ టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఇప్పుడెలా మారిందో చూడండి

హీరోలు ఎప్పుడు ఒకేలా ఉంటారు. కానీ హీరోయిన్ లు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారుతుంటరు అనే టాక్ ఎప్పుడు ఉండేదే. సినిమాల నుంచి దూరం అయ్యాక హీరోయిన్ల ఫోటోలు చూస్తే అప్పుడు చూసింది వీళ్ళనేనా అని షాక్ అవుతుంటారు. కొంత మంది సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటారు. కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటారు. అలా ఇప్పుడు వైరల్ అవుతున్న అవుతున్న హీరోయిన్ షహీన్ ఖాన్.

ఈ పేరు ఏంటి ఎక్కడో ఈ పేరు వినట్టు ఉందా? ఏ సినిమాలో నటించిందో గుర్తొచ్చిందా? నిజమే అంత త్వరగా మర్చిపోలేం. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు, ఏ సినిమాల్లో నటించిందో ఇప్పుడు మరోసారి చూసేద్దాం. షహీన్ ఖాన్..తెలుగులో ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడితో కలిసి చిరునవ్వుతో సినిమాలో నటించింది. వేణు తొట్టెంపూడి సినిమాల్లో చిరునవ్వుతో సినిమా టాప్ లో ఉంటుంది. ఇప్పటికి ఈ సినిమా విడుదలై 23 ఏళ్లయింది. అయినా ఇప్పటికి ఈ సినిమాని చూసిన బోర్ కొట్టదు.

దానికి కారణం టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఈ సినిమాకి మాటలు రాసింది మాటల మాంత్రికుడే. ఈ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ ఎవర్‌ గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమాని రామ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. ముంబైకు చెందిన షహీన్ ఖాన్ చిరునవ్వుతో లో హీరోయిన్‪గా నటించింది. చిరునవ్వుతో సినిమాలో సంధ్య పాత్రలో అందం, అభినయంతో ఆకట్టుకుంది.

ఈమె లుక్స్ కు కురాళ్ళ ఫిదా అయ్యారు. అందుకే తమిళ్‌,కన్నడ భాషల్లో చిరునవ్వుతో రీమేక్‌కాగా, వీటిల్లోనూ షహీన్‌ ఖానే కథానాయికగా నటించడం విశేషం. షహీన్ ఖాన్ కెరీర్ మాత్రం మోడల్‌గా ప్రారంబించింది. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌లో కూడా మెరిసింది. ఆ తరువాత చిరునవ్వుతో సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత రవిచంద్రన్‌, విజయ్‌ దళపతి వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేయుకుంది.

ఆ తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు షహీన్ ఖాన్ కు ఒక కూతురు కూడా ఉంది. సినిమాలకు దూరం అయినా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. కొత్త కొత్త ఫోటోలను షేర్ చేసుకుంటుంది. ఇప్పటికి షహీన్ ఖాన్ అందం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.