జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌ళ్లు చెదిరే ఆస్తులు… ఎన్నెన్ని కోట్లో… మైండ్ బ్లాకింగ్ లెక్క‌లు…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నందమూరి నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ద‌మ్ము ఉన్న కథ‌లని ఎంచుకుంటు ఎన్నో సూపర్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Jr NTR Car Collection Includes Lamborghini Urus

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసే స‌లార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 సంవత్సరాలు దాటుతుంది. కాగా ఎన్టీఆర్ సినిమాల ద్వారా దాదాపు రూ. 450 కోట్లకు పైగా స్థిరచరాస్తులను సంపాదించుకున్నారట.

Jr NTR's House: Details you Need to Know

ప్రస్తుతం ఎన్టీఆర్ ఉంటున్న విల్లా దాదాపు రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రూ. 80 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ తో పాటు ఎన్టీఆర్ వాడే వాచీల ఖరీదు కూడా మనని ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఎన్టీఆర్ దగ్గర ఉండే రీఛార్డ్ మిల్లే వాచ్ విలువ రూ.4 కోట్లు కాగా రూ. 2 కోట్లు విలువ చేస్తే నాటిలైజ్ 40 MM వాచ్ అలాగే పటేక్ ఫిలిప్ అనే ఖ‌రీదైన వాచ్ కూడా ఉందట. ఇవే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కార్ షెడ్ లో ఉండే కార్ల విలువ దాదాపు రూ. 15 కోట్ల అట.

Jr NTR

లంబోర్గిన్, బియమ్ డ‌బ్ల్యూ, పోర్ట్ మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ ఇలా ర‌క‌ రకాల కాస్ట్‌లీ కార్లు ఎన్టీఆర్ కి ఉన్నాయి. ఎన్టీఆర్ కి ఇవే కాక తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు కూడా చాలానే ఉన్నాయట. అటు మామ నార్నే శ్రీనివాస‌రావు కూడా కోట్లాది ఆస్తుల‌కు అధినేత కావ‌డంతో అటు క‌ట్నంగా కూడా కోట్లు ముట్టాయి. ల‌క్ష్మీప్ర‌ణ‌తికి స్థిర‌, చ‌రాస్తులు భారీగానే ముట్ట‌చెప్పారు. ఇలా ఎన్టీఆర్ కు ఇన్ని కోట్ల‌ ఆస్తులు ఉన్నా సరే ఎప్పుడు సింపుల్ గా ఉంటారు.