చరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన శంకర్.. సెట్స్ పైకి ఇండియన్ -2..!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడంతో హాలీవుడ్ లో కూడా చరణ్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తో ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా ప్రారంభించాడు. అటు ఫ్యాన్స్ ఇటు ట్రేడ్ లో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న సమయంలో తెలుగు నిర్మాతల సంఘం గిల్డ్ తీసుకున్న నిర్ణయం కారణంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో చరణ్, శంకర్ సినిమాకు బ్రేకులు పడ్డాయి. కాగా శంకర్ చరణ్ తో సినిమా కంటే ముందే కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా ప్రారంభించాడు. అయితే ఆ సినిమా సెట్స్ లో ప్రమాదం జరగడంతో కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా వల్ల, డైరెక్టర్ శంకర్ కు, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ వారికి మధ్య విబేధాలు తలెత్తడంతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది.

ఈ లోగా శంకర్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేయగా, లైకా ప్రొడక్షన్ వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఇండియన్ 2సినిమా కంప్లీట్ చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సినిమాల షూటింగ్ ఆగిపోవడంతో శంకర్ మళ్లీ ఇండియన్ 2 మూవీ షూటింగ్ మొదలు పెడుతున్నాడు.సెప్టెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు శంకర్ ప్రకటించాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. ఇండియన్ 2 పూర్తయ్యే వరకు మళ్లీ చరణ్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా మరింత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags: kamal hasan, pan india movie, ram chran, shanker, tollywood gossips, tollywood news