విడిపోయిన ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలిశారు.. ఎందుకంటే..!

ధనుష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే అతడిని ప్రేమించింది రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపారు పెద్దలు. వీళ్ల కాపురం 18 ఏళ్ల పాటు సాఫీగా సాగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరు ప్రకటించారు. వాళ్ళిద్దరినీ కలపాలని రజనీ కాంత్ చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది.

ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య వేర్వేరుగా ఉంటున్నారు. ధనుష్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఐశ్వర్య కూడా డైరెక్టర్ గా మారి బిజీ అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్, ఐశ్వర్య ఒక్క చోట కలిశారు. వారిద్దరికీ యాత్ర, లింగ అనే కుమారులు ఉన్నారు. యాత్ర స్కూల్ స్పోర్ట్స్ టీంకి కెప్టెన్ గా ఉన్నాడు. ఆ స్కూల్ యాత్రను కెప్టెన్ గా ఎంపిక చేసిన సందర్భంగా ఒక వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ధనుష్, ఐశ్వర్య హాజరయ్యారు. తమ పిల్లలతో కలసి ఫొటోలు తీసుకున్నారు.

విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత ధనుష్, ఐశ్వర్య కలసి కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ధనుష్, ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కావాలి.. అని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. గతంలో కూడా రజనీ కాంత్ వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటి అవుతారనే ఆశాభావాన్ని ప్రకటించారు. అందరూ కోరుకుంటున్నట్లు విబేధాలు మరచి ధనుష్, ఐశ్వర్య మళ్లీ ఒక్కటి అవుతారేమో చూడాలి.

Tags: aswarya, Dhanush, kollywood news