రమ్యకృష్ణ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో రాణిస్తుంది. తెలుగులో కొన్ని వందల సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ అగ్రతారలందరి సరసన నటించిన రమ్యకృష్ణ ఇటీవల రాజమౌళి డైరెక్టర్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రమ్యకృష్ణ తెరవెనక కూడా కొంతమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిందట ఏ సినిమా.. ఏవరికి డబ్బింగ్ చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం. రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా అనేక వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ జనాలను బాగా ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాల్లో శ్రీకాంత్ కి లవర్ గా నటించిన సోనాలి బింద్రే పాత్రకి రమ్యకృష్ణ నే డబ్బింగ్ చెప్పిందట.
అప్పటివరకు ఆమె సినిమాలకే ఆమె డబ్బింగ్ చెప్పుకొని రమ్యకృష్ణ ఖడ్గం సినిమాతో సోనాలి బింద్రే డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె సినిమాలన్నిటికీ రమ్యకృష్ణనే డబ్బింగ్ చెప్పుకుందట. అది కాక కాజల్ నటించిన చందమామ సినిమా ఎంత హిటో అందరికి తెలుసు. ఈ సినిమాలో కాజల్ కూడా రమ్యకృష్ణనే డబ్బింగ్ చెప్పింది. ఇలా కృష్ణవంశీ.. రమ్యకృష్ణతో డబ్బింగ్ చెప్పించే ప్రయోగంలో సక్సెస్ అయ్యారు. రమ్యకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తో దూసుకుపోతుంది.