మీలో క‌రోనా వైర‌స్ రిస్క్ ఎంత‌… సంజీవ‌న్ చెప్పేస్తోంది ఇలా…!

ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టంగా ప‌రిణ‌మించిన క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19)పై అనేక వార్త‌లు వైర‌ల్ అవు తున్నాయి. వీటిలో ఏవి న‌మ్మాలి? ఏవి న‌మ్మ‌కూడ‌దు? అనేది ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. ము ఖ్యంగా ఇంట్లో రెమిడీల‌పైనా అది కూడా తెలుగు వారి కి అత్యంత అనుకూల‌మైన ప‌సుపు రాసుకోవడం, ప‌సుపు నీళ్లు తాగడం, వెల్లుల్లిని ఎక్కువ‌గా వినియోగించ‌డం వంటివి చేయ‌డం ద్వారా క‌రోనాను అరికట్టొ చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఇలాంటివి చేయ‌రాద‌నే మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి వీటిలో ఏవి న‌మ్మాలి ? ఏవి చేయాలి ? ఏవి చేయ‌కూడ‌దు..!

అదేవిధంగా మ‌న‌కు అస‌లు క‌రోనా ఉందా ? దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉన్నాయి ? ఈ ల‌క్ష‌ణాలు కూడా ఎప్ప టికప్పుడు, వ్య‌క్తి నుంచి వ్య‌క్తికి మార్పు చెందుతాయా? అస‌లు ఈ ల‌క్ష‌ణాలు మ‌న‌లో ఉన్నాయా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతాయి. ఈ విష‌యంలోనూ ఎవ‌రూ స‌రైన విధంగా మ‌న‌కు గైడ్ చేసేవారు లేరు. అదేస‌మయంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఈ స‌మ‌స్య‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు అనేక అధ్య‌య‌నాలు చేస్తున్నారు. వీరి అభిప్రాయాలు ఏమిటి? అనేది కూడా ఎవ‌రూ మ‌న‌కు పూర్తిగా వివ‌రించ‌లేని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే కోటిరెడ్డి ఫౌండేష‌న్ ఈ ప్ర‌క్రియ‌ను భుజాన వేసుకుంది.

ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేసేందుకు ఆన్‌లైన్‌లోనే క‌రోనా యుద్ధాన్ని ప్ర‌క‌టించింది. దీనికిగాను మ‌నం చేయాల్సింది చాలా సింపుల్‌. కోటిరెడ్డి ఫౌండేష‌న్ సృష్టించిన యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, దానిలో మ‌న వివ‌రాలు తెలిపి, మ‌న, మ‌న కుటుంబ స‌భ్యుల ఆరోగ్యాన్ని తెలుసుకోవ‌చ్చు. అదేవిధంగా ఈ యాప్‌లోక‌రోనాపై లైవ్ అప్ డేట్స్‌తో పాటు వైద్యుల సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటించ‌వ‌చ్చు. క‌రోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కూడా తెలుసుకుని ఆవిధంగా ముందుకు సాగ‌వ‌చ్చు.

గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లేస్టోర్‌ల నుంచిhttps://play.google.com/store/apps/details?id=com.nihn&hl=enల‌ను డౌన్ చేసుకుని క‌రోనాపై స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. https://nihwn.co/ఇక‌, కోటిరెడ్డి ఫౌండేష‌న్ ఈ విష‌యంలో అమెరికాలోని హార్వ‌ర్డ్ గ్లోబ‌ల్ హైతోను, ఏపీలోని శ్రీవెంక‌టేశ్వ‌ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌తోను ఒప్పందం చేసుకుని వారి నుంచి కూడా స‌మాచారాన్ని సేక‌రించి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తుండ‌డం గొప్ప‌విష‌యం.

Tags: AP, APP, CO, Coronavirus, INDIA, NIHWN