బాలీవుడ్ సూపర్ హిట్ రియాలిటీ షోస్ లో కాఫీ విత్ కరణ్ షో ఒకటి. ఆ షోకి వెళ్తున్నారు అంటే వారు బూతు బాగోతం బయటపెట్టడం పక్కా అని చెప్పొచ్చు. ఎప్పుడు సెక్స్, ఎఫైర్స్ గురించిన విషయాలనే కరణ్ (Karan Johar) టార్గెట్ చేస్తుంటాడు. అయితే ఈ షో మీద ఎంతోమంది రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఈ షోని ఓటీటీకి పరిమితం చేశారు. సీజన్ 6 వరకు టీవీలో చేసిన కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7 నుంచి ఓటీటీకి మార్చారు.
ఈ క్రమంలో తన షోని అభిమానించే వారి వల్ల కన్నా తిట్టే వారి వల్ల ఎక్కువ పాపులర్ అవుతుంది. నా షో వారికి నచ్చట్లేదని తిట్టేందుకు తన షోని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పాడు కరణ్ జోహార్ (Karan Johar). ఇక ఎవరెన్ని చెప్పినా.. ఎవరేం చేసినా తన షోని మాత్రం ఆపే ఉద్దేశం లేదని కరణ్ తేల్చి చెప్పాడు.
ఇక తెలుగు పరిశ్రమ నుంచి సమంత, విజయ్ దేవరకొండలే ఆ షోలో పాల్గొన్నారు. అఫ్కోర్స్ బాహుబలి టైం లో ప్రభాస్, రానాలు కూడా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు.