ఆఫీస్ రూమ్‌కి పిలిచి మరి..స్టార్ హీరోయిన్ గూబ పగల కొట్టిన చిరంజీవి..ఎందుకంటే..?

మెగాస్టార్ చిరంజీవి చూడడానికి ఎంతో సాఫ్ట్ గా సైలెంట్ గా కనిపిస్తారు. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం ఆపటం ఎవరి తరం కాదని చిత్ర పరిశ్రమలో ఉన్నవారు చెబుతూ ఉంటారు. ఇదే సమయంలో చిరంజీవి తనతో నటించిన కొందరు హీరోయిన్లతో చాలాసార్లు ఎంతో ఇబ్బందిగా ఫీలైన విషయం చాలామందికి తెలిసిందే. చిరంజీవి తన కెరీర్ మొదటిలో సీనియర్ హీరోయిన్ మాధవి తన కారులో కూర్చుంటేనే పక్కన కూర్చుంటావా అంటూ అవమానించిన సంగతి ఇప్పటికే చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం.

Gharana Mogudu Telugu Full Movie | Chiranjeevi | Nagma | Vani Viswanath |  Latest Telugu Full Movies - YouTube

అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ లాగే మరో హీరోయిన్ కూడా చిరంజీవిని ఎంతో దారుణంగా పక్కకు తీసి పడేసిందట. అంతేకాదు చిరుతో చేసిన‌ మూవీ యూనిట్ ని కూడా అవమానించిందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ నగ్మా. అందాల భామ నగ్మా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తలోనే వరుసగా బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో స్టార్ స్టేటస్ ను అందుకుంది. అలా వచ్చిన స్టార్ డంను నగ్మా వినియోగించుకోకుండా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యిందట.

Mugguru Monagallu Telugu Full Length Action Comedy Film | Chiranjeevi |  Ramya Krishna - YouTube

ఇదే సమయంలో నగ్మా, చిరంజీవి కాంబినేషన్లో ఘరానా మొగుడు సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ముగ్గురు మొనగాళ్లు సినిమాలో కూడా నగ్మా హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నగ్మా తనకి ఇష్టం వచ్చినట్లు చేసేదట. సమయానికి షూటింగ్ సెట్లో ఉండేది కాదట. అంతేకాకుండా ఈ సినిమాని చిరంజీవి తన తమ్ములతో కలిసి స్వయంగా నిర్మించాడు. అలా చిరంజీవి డబ్బుని సమయాన్ని వృధా చేస్తూ నగ్మా ఈ సినిమా షూటింగ్లో ఎంతో రచ్చ చేసిందిట.

Gharana Mogudu Movie Songs || Endibe Ettaga Undhi - Chiranjeevi, Nagma -  YouTube

అదే సమయంలో ఓ రోజు నగ్మా తీరు చూసి చిరంజీవి ఇలా అయితే షూటింగ్ సరిగ్గా జరగదు అని భావించి. డైరెక్ట్ గా తన ఆఫీస్‌ రూమ్ కి పిలిచి గట్టిగా అడిగాడట. ఇక దానికి నగ్మా తిక్క తిక్క సమాధానం చెబుతూ వచ్చిందట. ఇక దీంతో చిర్రెత్తుకొచ్చిన చిరంజీవి లాగిపెట్టి చంప మీద ఒకటికటి కొట్టడంతో నగ్మా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు నువ్వు ఇప్పుడేే ఇండస్ట్రీ లోకి వచ్చావు ఇలా చేస్తే ఇండస్ట్రీలో ఎదగటం కష్టమంటూ ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చాడట. అప్పటినుంచి నగ్మా తన తీరును మార్చుకొని షూటింగ్లకు సరైన సమయానికి వచ్చేసేదట.