అల్లు అర్జున్‌కు భార్య కావాల్సిన అమ్మాయి ఎవ‌రో తెలుసా… ఆమె దుర‌దృష్ట‌మే స్నేహారెడ్డికి వ‌రం..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. తన మొదటి సినిమా గంగోత్రితోనే తన నటనతో ప్రేక్షకులు మెప్పించాడు. చిన్న వయసులోనే తనలో నటించే సత్తా ఉందంటూ తన స్టామినా బయట పెట్టాడు. ఆ తర్వాత వరుస‌ సినిమాలు చేస్తూ తనదైన రీతిలో హిట్లు, ప్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ భారీ ఆఫర్లను పట్టేశాడు.

Allu Arjun to wife on anniversary: Love grows every day

ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ఉన్న అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ పెంచుకున్నాడు. బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయం అందుకుని.. బన్నీకి బాలీవుడ్ లో కూడా తిరుగులేని స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టింది.. ప్రస్తుతం ఈ అల్లు హీరో పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన క్రేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఇదే సమయంలో అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అప్పట్లో వీరి పెళ్లి టాలీవుడ్ లోనే ఓ సెన్సేషన్. అల్లు అర్జున్- స్నేహారెడ్డిని ప్రేమించకుండా ఉంటే.. ఆయన తన బంధువుల్లో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడట‌.

Allu Arjun, Sneha Reddy's stylish moments | Zoom TV

మొదటి నుంచి అల్లు అర్జున్ కి వారి బంధువులలో ఉన్న ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనీ.. వాళ్ల అమ్మగారు అనుకునేవారట. బ‌న్నీ తన లైఫ్ లో సెటిల్ అయ్యాక.. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పి గ్రాండ్‌గా పెళ్లి చేయాలని అనుకునేవారట.. అయితే అల్లు అర్జున్ ఈలోపే స్నేహారెడ్డిని చూడటం ఆమెను ప్రేమించడం… అదే విష‌యం బ‌న్నీ వాళ్ల అమ్మ‌కు చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సి వచ్చింది. స్నేహారెడ్డి రాకపోతే ఖచ్చితంగా బన్నీ తన భార్య స్థానంలో వాళ్ళ అమ్మగారు అనుకున్న అమ్మాయి ఉండేదట. అయితే బ‌న్నీకి భార్య అయ్యే అదృష్టం స్నేహారెడ్డికి ఉండ‌డంతో ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.