మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) లో విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈరోజు ఏకంగా హీరో రాజశేఖర్ వ్యవహరించిన తీరుపై మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్‌బాబులు సీరియస్ అయ్యారు. అంతేకాదు.. ఏకంగా రాజశేఖర్ తీరును తప్పుపట్టడమే కాకుండా అతడి వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. దీంతో మనస్థాపంతో రాజశేఖర్ పలయానం చిత్తగించాడు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు లు రాజశేఖర్‌పై సీరియస్ కావడం ఇప్పుడు సిని పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకు రాజశేఖర్ పై మెగాస్టార్ సీరియస్ కావడానికి కారణమేంటో తెలుసా..
గురువారం హైదరాబాద్‌లోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన చిరంజీవి, మోహన్‌బాబు, కృష్ణంరాజుతో పాటు పరుచూరి గోపాలకృష్ణ, హీరో రాజశేఖర్, సుబ్బిరామిరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవిత, నరేష్, రాజరవీంద్ర, జయసుధ, హేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా లో గతంలో జరిగిన సంఘటనలను మెగాస్టార్ ప్రస్తావిస్తూ.. మా లో మంచి ఉంటే మైక్‌లో చెబుదాం.. చెడు ఉంటే చెవిలో చెబుదాం అని అన్నారు. దీంతో ఆవేశంగా వేధికెక్కిన హీరో రాజశేఖర్ వేధికపై ఉన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతిలోని మైక్‌ను లాక్కున్నాడు.
పరుచూరి గోపాలకృష్ణ చేతిలో మైక్ లాక్కున్న రాజశేఖర్ వెంటనే మెగాస్టార్ చిరంజీవి ప్రసంగాన్ని తప్పుపట్టాడు. చెప్పెదొకటి.. చేసేది మరొకటి అని విమర్శలు చేయడంతో కార్యక్రమంలో కలకలం రేగింది. వెంటనే మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ వ్యవహర శైలీని తప్పుపట్టాడు. ఇది మంచి పద్దతి కాదని హితువు పలికారు. కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మెగాస్టార్ చిరంజీవి అనడంతో పాటు.. ఇలాంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించాడు. దీంతో వెంటనే రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా లో ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి కేంద్ర బిందువులుగా జీవిత రాజశేఖర్‌లు ఉంటున్నారు.
అయితే ఇప్పుడు మా లో ఈ రోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా రాజశేఖర్ సీనియర్ నటుడు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతిలోని మైక్‌ను లాక్కుని, చిత్ర పరిశ్రమలోని పెద్ద హీరోలపై వ్యతిరేక వ్యాఖ్యాలు చేయడంతో చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. అసలు మా లో విభేదాలతో చిత్ర పరిశ్రమలోని సభ్యులంతా దిక్కుతోచని స్థితిలో ఉంటే.. ఇలా రాజశేఖర్ వ్యవహరించి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ ఏడాదిలోనైనా మా లోని వ్యవహరాలు చక్కబడుతాయనుకుంటే.. ఇలా ఆదిలోనే హంసపాదులా మారడం చర్చనీయాంశంగా మారింది. మరి రాజశేఖర్‌పై మా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.