ఏపీలో రాజుకున్న సామాజిక వర్గ పోరు.. ఇప్పుడు మరింత ఎక్కువైందా? దీనికి మంత్రి బొత్స వ్యాఖ్యలే కా రణంగా కనిపిస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం మూడు రాజ ధాను ల విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా అమరావతిలో చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన రాజధానిని ఓ సామాజికవర్గం లబ్ధి పొందేందుకు మాత్రమే ఏర్పాటు చేశారని వైసీపీ ప్రబుత్వం గతంలో అ నేక మార్లు ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం లబ్ధి కోసమే ఇక్కడ రా జధానిని ఏర్పాటు చేశారని చెబుతున్న వైసీపీ నేతలు.. అందరికీ మేలు జరగాలనే తాము మూడు ప్రాంతా లను ఎంచుకున్నామని చెబుతున్నారు.
దీంతో తటస్థంగా ఉండే మెజారిటీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఇంతలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మరో కీలక వ్యాఖ్య చేశారు. తాజాగా గురువారం ఆయన విశాఖలో మాట్లాడుతూ.. రాజధానిని విశాఖకు తరలించినా..తమకు ఎలాంటి లబ్ధి జరగదని చెప్పారు. అం తటితో ఆగకుండా ఆయన రాజధానిని విశాఖకు తరలించాక కూడా చంద్రబాబు సొంత సామాజిక వర్గమే లాభిస్తుందని, వారే భూములు, భవనాలు కొంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా అప్పటి వరకు రాజధానిపై జరుగుతున్న చర్చ కాస్తా యూటర్న్ తీసుకుంది.
ఒకవేళ బొత్స సత్యనారాయణ చెప్పిందే నిజమైతే.. రాజధానిని విశాఖకు తరలించాక కూడా బాబు సామాజిక వర్గమే అభివృద్ది చెందేటట్లయితే.. ఇప్పుడున్న అమరావతిని మార్చడంఎందుకు ? అనే ప్రశ్న తెరమీదకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఒకే సామాజిక వర్గం లబ్ధి పొందుతోందనే కారణంగా తరలిస్తున్నారు. మరి అలాంటి సమయంలో అక్కడ ఏర్పాట చేసినా.. ప్రయోజనం ఏంటనేది వారి ప్రశ్న. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స వ్యాఖ్యలను తప్పుబడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. విశాఖ పట్నం.. ఓ మినీ మెట్రో సిటీగా ఉంది. అక్కడ అన్ని వర్గాల ప్రజలూ ఉంటున్నారు. ప్రశాంత జీవనానికి విశాఖ పెట్టింది పేరు. ఎలాంటి అలజడులను వారు స్వాగతించరు. కానీ అక్కడ కూడా.. కులం కుంపట్లు పెట్టడానికి బొత్స సత్యనారాయణ సిద్ధమయినట్లుగా ఉందని విమర్శకులు అంటున్నారు.
ఎక్కడయినా.. అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారు. వీరు మాత్రమే ఉండాలి. అనే సిద్దాతాలు షరుతులు ఏమీలేదు. మరి అలాంటప్పుడు కేవలం ఓ సామాజిక వర్గాన్ని మత్రమే దోషిగా చూపించే తత్వం ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మంత్రులు అలవరుచుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీకి బాబు సొంత సామాజిక వర్గం కూడా ఓట్లు వేసిందనే విషయాన్ని ఎందుకు వైసీపీ నాయకులు గుర్తించ లేక పోతున్నారనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. అయినా కూడా కేవలం బాబుపై కోపంతోనే నాయకులు ఇలా మాట్లాడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.