మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకోగా, తాజాగా గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు.

ఈ నెల 22వ తేదీ చిరంజీవి బర్త్ డ్. చిరు బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడం ఆనవాయితీగా వస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ వుంటుందని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్ డేట్ ఇచ్చారు.

చిరంజీవి బర్త్ డే 22 అయితే ఒక రోజు ముందుగానే.. అంటే 21వ తేదీనే గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ సినిమాను నిర్మిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఒక ట్వీట్ చేసింది. 21వ తేదీన గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా చిరంజీవికి సంబంధించి ఒక స్టైలిష్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. గాడ్ ఫాదర్ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నయనతార, యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Tags: chiranjeevi, chiranjeevi godfather, tollywood news