భోళాశంకర్ Vs భగవంత్ కేసరి… ఏది హిట్‌… ఏది ఫ‌ట్‌…!

టాలీవుడ్ సినిమా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కలెక్షన్లు పరంగా బాలయ్య సినిమా కంటే చిరంజీవి సినిమా వీరయ్య కాస్త పైచేయి సాధించింది. బాలయ్య, చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు పోటీపడినా ఆసక్తి ఉంటుంది. వీరిద్దరూ 2017 సంక్రాంతికి కానుకగా తమ కెరియర్ లో ప్ర‌తిష్టాత్మ‌క‌ సినిమాలు ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీప‌డ్డారు.

అప్పుడు కూడా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు హిట్లు కొట్టాక ప్రస్తుతం వీళ్ళిద్దరూ నటిస్తున్న తాజా సినిమాల‌పై భారీగా అంచనాలు ఉన్నాయి. చిరంజీవి భోళా శంకర్, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాలు టీజర్లు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి, బాలయ్య మధ్య ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరూ కొత్త సినిమాలు టీజర్ల‌పై కూడా సోషల్ మీడియాలో పోలికలు మొదలయ్యాయి.

ఈ ఇద్దరు హీరోల అభిమానులు తమ హీరో టీజరే బాగుందని.. కాదు తమ హీరో టీజరే బాగుందంటూ కొట్టుకుంటున్నారు,ఈ గొడవల సంగతి పక్కన పెడితే భోళా శంకర్, భగవంత్‌ కేసరి సినిమాల టీజర్లలో ఒకటి మాత్రం అంగీకరించాల్సిన నిజం. భ‌గ‌వంత్‌ కేసరి సినిమాల్లో బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రను పోషిస్తున్నారు. భోళా శంకర్ లో చిరంజీవి మాత్రం అలాంటి పాత్రలో కనిపించలేదు. చిరంజీవి సినిమా టీజర్ లో కాస్ట్యూమ్స్ ఏమాత్రం బాగోలేదు..

ఇక క‌థ కూడా కొత్తగా ఉన్నట్టు అనిపించలేదు. డైలాగులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా రొటీన్ గానే ఉంది. ఇక చిరంజీవి ట్రై చేసిన తెలంగాణ యాస కూడా సెట్ అవ్వలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే చిరంజీవి సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదంటున్నారు. చిరంజీవి ఇలాంటి మసాలా సినిమాలు గ‌తంలో చేసి ఉండ‌డం.. ఈ టీజ‌ర్లో కొత్త సీన్లు లేక‌పోవడం ఏమాత్రం బాగోలేదు అంటున్నారు.

బాలయ్య సినిమా టీజ‌ర్ చాలా కొత్తగా ఉంది. బాలయ్య చెప్పిన డైలాగులతో పాటు, బాలయ్య లుక్, స్టైల్ అంతా కొత్తగా ఉండడంతో పాటు సినిమాపై మంచి హైప్‌ ఉంది. ఈ రెండు సినిమాల్లో భోళాశంకర్ ముందుగా థియేటర్లోకి వస్తుంది.. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ లో బాలయ్య భగవంత్‌ కేసరి రిలీజ్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ చెయ్ ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.