ఏపీలో వచ్చే శాసనసభ ఎన్నికలకు ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఎలాంటి డిస్టబెన్స్ లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే 110 నియోజకవర్గాలలో సమీక్షలు పూర్తవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇక పార్టీలో బహుళ నాయకత్వ సమస్య ఉన్నచోట్ల.. పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల.. కొన్ని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడం చంద్రబాబుకు ముఖ్యం. ఈ దిశగానే ఆయన ఎంతో ?కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఎంపికలో ? చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికలలో చంద్రబాబు సీనియర్ల కోరిక మేరకు వారిని పక్కన పెట్టి వారి వారసులను రంగంలోకి దింపారు. పోటీ చేసిన వారసులలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని మినహా అందరూ ఓడిపోయారు.
అయితే ఈసారి చంద్రబాబు కొన్నిచోట్ల తన నిర్ణయం మేరకే ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ నేతలకు మళ్ళీ అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం. గత ఎన్నికలలో కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు వారసురాలు అధితి గజపతికి విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇవ్వగా.. ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అయితే ఈసారి అశోక్ గజపతిని విజయనగరం అసెంబ్లీ బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం ఎంపీగా బీసీ వర్గానికి చెందిన నేతల పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి నారాయణ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆయన స్థానంలో కొత్త ఇన్చార్జిని అక్కడ నియమించారు.
ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సమీకరణలు మారడంతో పాటు నెల్లూరు సిటీలో నారాయణ పోటీ చేస్తే గెలుపు పక్క అన్న నివేదికలు చంద్రబాబు దగ్గరకు చేరాయి. దీంతో మళ్లీ నారాయణకే నెల్లూరు టికెట్ ఇవ్వటం దాదాపు ఖరారు అయింది. ఏదేమైనా ఈసారి ప్రతి నియోజకవర్గంలో గెలుపు విషయంలో చంద్రబాబు పక్క క్లారిటీతోనే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.