ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి..ఇప్పటివరకు అధికార బలంతో హవా కొనసాగించిన వైసీపీకి రివర్స్ అవ్వడం మొదలైంది..అటు టిడిపి హవా పెరుగుతూ వస్తుంది. వైసీపీకి ధీటుగా టిడిపి బలపడుతూ వస్తుంది. పరిస్తితి ఎలా వచ్చిందంటే…ఇప్పటివరకు వరుసగా వైసీపీ గెలుస్తూ వస్తున్న సీట్లలో కూడా టిడిపి బలపడుతుంది. ఇదే ఊపు కొనసాగితే ఆ సీట్లలో టిడిపి గెలుపు ఖాయమే. అలాంటి పరిస్తితి..ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది.
అసలు కర్నూలు అంటే వైసీపీ కంచుకోట..గత ఎన్నికల్లో 14కి 14 స్థానాలని వైసీపీ గెలుచుకుంది..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు..వైసీపీకి టిడిపి చెక్ పెట్టే విధంగా బలపడింది. సగం స్థానాల్లో టిడిపి లీడ్ లోకి వచ్చింది. ఇంకా కొన్ని స్థానాల్లో బలపడుతుంది. ఇదే క్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ స్థానంలో టిడిపి వేగంగా పుంజుకుంటుంది. అసలు డోన్ లో టిడిపి గెలిచింది మూడు సార్లే 1985, 1999, 2009 ఎన్నికల్లోనే అక్కడ గెలిచింది. మిగిలిన అన్నీ సార్లు కాంగ్రెస్ గెలిచింది.
గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి బుగ్గన గెలుస్తున్నారు. ఇలా రెండు సార్లు గెలిచిన బుగ్గన..డోన్‌కు చేసింది ఏమి లేదు..ఇప్పుడు మంత్రిగా ఉంటూ కూడా డోన్‌ని అభివృద్ధి చేయలేదు..అన్నిటికంటే ఆయన ప్రజల్లో ఉండటం లేదు..ప్రజా సమస్యలని పట్టించుకునేది లేదు. దీంతో నిదానంగా డోన్ లో బుగ్గనపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది.
ఇక అక్కడ టిడిపి ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి దూకుడుగా పనిచేయడం…టిడిపికి అడ్వాంటేజ్. ఆయన ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఇంకా క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవాల్సి ఉంది. ఇటీవల సర్వేల్లో కాస్త వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తుంది. సుబ్బారెడ్డి ఇంకా కష్టపడితే..ఈ సారి డోన్ లో బుగ్గనకు హ్యాట్రిక్ ఛాన్స్ దక్కకుండా చేయవచ్చు.