ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ ‘ బ్రో ‘ డే 1 ఓవ‌ర్సీస్ వ‌సూళ్లు..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌స్తోంది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్తో పాటు అటు ఓవ‌ర్సీస్ షేక్ అయిపోతూ ఉంటుంది. అస‌లు ప‌వ‌న్‌కు ఓవ‌ర్సీస్‌లో ఉన్న ఛ‌రిష్మా గురించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్లాప్ సినిమాల‌తో కూడా అక్క‌డ తిరుగులేని వ‌సూళ్లు సొంతం చేసుకున్నాడు. అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ సినిమా కూడా అక్క‌డ కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తో వ‌న్ మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు సొంతం చేసుకుంది.

ఇక వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్ లాంటి రెండు హిట్ సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ మూడోసారి కూడా రీమేక్ సినిమాతోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా రీమేక్ కావ‌డంతో ఎందుకో ముందు నుంచి ప‌వ‌న్ రేంజ్ బ‌జ్ అయితే క్రియేట్ కాలేదు. ఇక తొలి రోజు ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే షోలు కంప్లీట్ అయ్యాయి.

అమెరికాలో ది ఓపెన్ హైమ‌ర్‌తో పాటు బార్చి సినిమాల‌కు ఎక్కువ థియేట‌ర్లు ఇవ్వ‌డంతో బ్రో లిమిటెడ్ థియేట‌ర్ల‌లోనే రిలీజ్ అయ్యింది. అటు థియేట‌ర్లు త‌క్కువ దొర‌క‌డం, ఇటు ప‌వ‌న్ రేంజ్ హైప్ లేక‌పోవ‌డం, టాక్ కూడా మ‌రీ ఇర‌గ‌దీసి లేక‌పోవ‌డంతో ఫ‌స్ట్ డే ప్రీమియ‌ర్ వ‌సూళ్లు కూడా త‌క్కువుగానే న‌మ‌దు అయ్యాయి.

సాయంత్రం 6.30 గంట‌ల‌కు 5.18 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌చ్చాయి. అంటే హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ అయ్యింది. ఇది ప‌వ‌న్ లాంటి పెద్ద హీరోకు చాలా చిన్న ఫిగ‌ర్ అనే చెప్పాలి. మ‌రి సినిమా క్లాస్ మూవీ కావ‌డంతో పాటు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ఎక్కితే ఓవ‌ర్సీస్‌లో బ్రో మెల్ల‌గా పుంజుకోవ‌చ్చు.