ఫీల్మ్‌ఫేర్ అవార్డుల‌పై కంగ‌న సోద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయాల్లో.. సినిమాల్లో అవార్డులు ప్ర‌క‌టించిన ప్ర‌తి సారి ఏదో వివాదం చెల‌రేగుతూనే ఉంటుంది. వివ‌క్ష చూపార‌ని, పైర‌వీకారుల‌కే అవార్డులను ప్ర‌క‌టించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. కొంద‌రు మాత్రం బాహాటంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. అవార్డులు ద‌క్క‌ని వారు అక్క‌సుతో ఏవేవో పేలుతుంటారు. తాజాగా అస్సాం రాష్ర్టం గుహ‌వ‌టిలో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన బాలివుడ్ ఫిల్మ్‌పేర్ 65వ అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన తారలందరూ హాజరయ్యారు. ఇదిలా ఉండ‌గా ఆ పుర‌స్కారాల ఎంపిక‌పైనా ప్ర‌స్తుతం భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ పుర‌స్కారాల‌పై కంగాన ర‌నౌత్ సోద‌రి రంగోలి చేసిన ఓ ట్విట్ వివాదాస్ప‌దంగా మార‌డ‌మేగాక ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. బాలివుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఇంత‌కీ రంగోలి ఏమ‌న్నారంటే.. బాలీవుడ్‌లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని, అందుకే ఆమెకు, ఆమె నటించిన చిత్రాలకు పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేయ‌లేద‌ని రంగోలీ ఆరోపించ‌డం సంచ‌ల‌నాన్ని రేపుతున్న‌ది. బాలీవుడ్ మూవీ’ గల్లీబాయ్’కి ఎక్కువ అవార్డులు దక్కాల్సింది కాద‌ని, ఏమంత గొప్ప‌గా న‌టించ‌క‌పోయినా ఉత్తమ నటిగా అలియాభట్‌కు అవార్డు ఇచా్చ‌ర‌ని విమర్శించారు. ఉత్తమ సహాయ నటిగా అనన్యపాండే కంటే ‘పటాఖా’ సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇచ్చి ఉంటే బాగుండేద‌ని, త‌ద్వారా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించినట్లు ఉండేదని రంగోలి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ‘మణికర్ణిక’ సినిమాలో ఝలకరిభాయ్ గా నటించిన అంకితకు ఉత్తమసహాయ నటి అవార్డు ఇవ్వొచ్చ‌ని ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలివుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags: alia bhut, ananya, bollywood film fare awards2020, goa, raveer kappor