ఢిల్లీ ఎన్నికలు బిజెపికి నేర్పించింది ఇదేనా…?

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఊహించని విధంగా కంగుతింది. అసలు ఆ స్థాయిలో ఓడిపోతామని కూడా బిజెపి గ్రహించి ఉండదు. తాము గెలుస్తామని ఏడాది నుంచి బిజెపి చెప్తూ వస్తుంది. ఢిల్లీ ని గెలిస్తే తమకు తిరుగు ఉండదని భావించిన ఆ పార్టీ చాలానే కష్టపడింది ఢిల్లీ పీఠం కోసం. కాని విజయలక్ష్మి మాత్రం ఆప్ ని వరించింది. దీనితో ఇప్పుడు అసలు బిజెపి రాజకీయ భవిష్యత్తు ఏంటీ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

60 ఏళ్ళ కాంగ్రెస్ లో దేశం ఇబ్బంది పడింది కాబట్టి గుజరాత్ మోడల్ ని దేశం చూసింది కాబట్టి ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ వలన అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ముస్లి౦ వర్గాలు కూడా జై మోడీ అన్నాయి. అయితే ఈ ఆరేళ్ళ కాలంలో చాలానే జరిగాయి. కాని దేశం మాత్రం అభివృద్ధి చెందలేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

నోట్ల రద్దు లాంటి ఏకపక్ష నిర్ణయాలతో దేశం ఇబ్బందులు పడింది. పౌరసత్వ సవరణ సహా అనేక నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎన్నికల ముందు జరిగే దాడులు కూడా ప్రజలకు స్పష్టంగా అర్దమవుతున్నాయి. పాకిస్తాన్ అంశాన్ని వాడుకుని లబ్ది పొందాలని మోడీ చూస్తున్నారు అనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్ధమవుతుంది. తాను చేసింది ఎప్పుడూ కూడా మోడీ చెప్పుకునే పరిస్థితి లేదు.

కనీసం సమీక్షలు నిర్వహించి పలానా శాఖ గురించి ఆరా తీసిన సందర్భం లేదు. ఇవన్ని ప్రజలు ఇప్పుడు ఆలోచించే పరిస్థితి వచ్చింది కాబట్టే దేశ రాజధాని ఢిల్లీలో గత అయిదేళ్ళు గా ఆప్ ని ఏ విధంగా అల్లరి చేసినా సరే బిజెపి అధికారంలోకి రాలేకపోయింది. పౌరసత్వ సవరణ లాంటి కబుర్లు, జాతీయవాదం లాంటి విషయాలు జనానికి అవసరం లేదనే విషయం అర్ధమైంది.

ఆప్ గెలిచింది కేవలం సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి, శాంతి భద్రతలను, సామాన్యుడికి ఎమిచ్చిందో తన ప్రభుత్వం కేజ్రివాల్ చెప్పారు. ఆ విధంగానే అడుగులు వేసారు. అందుకే బిజెపి ఎన్ని విధాలుగా ఆప్ ని ఇబ్బంది పెట్టినా సరే విజయం సాధించలేకపోయింది. ప్రజలు తమకు ఎం కావాలో చూసారు గాని తమ భావోద్వేగాల గురించి ఆలోచించలేదు. అందుకే బిజెపికి దిమ్మ తిరిగిపోయింది.

Tags: Amit Shah, bjp, Delhi Elections, INDIA, modi