బండ్లన్న జనసేనలో చేరనున్నారా..? ఇదిగో క్లారిటీ..!

బండ్ల గణేష్ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకున్న వ్యక్తి. పవన్ హీరోగా నటించిన తీన్ మార్ సినిమాతో గణేష్ నిర్మాతగా మారాడు. ఆ తర్వాత రెండో సినిమాగా పవన్ తోనే గబ్బర్ సింగ్ తీసి గ్రాండ్ హిట్ కొట్టాడు. ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. నా దేవుడు.. నా దేవర పవన్ కళ్యాణ్ అని.. నిత్యం ఆయన నామస్మరణ చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చాక గణేష్ కూడా ఆ పార్టీలో చేరతారని అంతా భావించారు. అయితే గత ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.

అయితే ఆయనకు టికెట్ దక్కక పోవడంతో ఆ పార్టీ నుంచి దూరమయ్యారు. అయితే ఇటీవల బండ్లన్న మెల్లగా మళ్లీ పవన్ భజన చేస్తున్నాడు. సినిమాల వరకు అయితే ఓకే కానీ రాజకీయంగా కూడా పవన్ ను విమర్శించిన వారికి కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు నిన్న పవన్ పై ఓ ట్వీట్ వేశారు. ‘కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తున్నారా.. లేదా.. ఇండిపెండెన్స్ డే అయినా క్లారిటీ ఇవ్వండి ‘ అని ట్వీట్ చేశారు.

దీనిపై బండ్ల గణేష్ మంత్రి రాంబాబుకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘అలాగే రాం బాబు గారు.. మా సారు తొందర్లోనే మీకు సమాధానం చెబుతారు. జై పవన్ కళ్యాణ్’ అని ట్వీట్ చేశారు. రాజకీయంగా బండ్ల గణేష్ ఏకంగా మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ వేయడంతో గణేష్ ఇక జనసేనలో చేరనున్నారనే టాక్ మొదలైంది. జనసేనలోకి వెల్కమ్ అంటూ గణేష్ కు పవన్ ఫ్యాన్స్ స్వాగతం పలుకుతున్నారు.

Tags: amabati rambabu, bandala ganesh, JanaSenaParty, Pawan kalyan, tdp, ysrcp