బాలయ్య,అనిల్ రావిపూడి సినిమా వాయిదా?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా ఎనౌన్స్ కూడా చేశారు.ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన కొత్త చిత్రం వీరసింహారెడ్డికి తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బాలయ్య-అనిల్ సినిమా గురించిన వార్తలు చాలా మందికి ఊహల్లో చిక్కుకున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2023కి వాయిదా పడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొదట్లో ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్నారు కానీ వీరసింహారెడ్డి ఇంకా షూటింగ్ పూర్తి చేయకపోవడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ వార్త నిజమో కాదో తెలియాల్సింది ఉన్నది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.

Tags: anil raavipudi, balakrishna, teugu news, tollywood news