ANR : ఆ హీరోయిన్ అంటే భయమని చెప్పిన ఏయన్నార్..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు అంటే ఎన్.టి.ఆర్, ఏయన్నార్ (ANR) అని తెలిసిందే. ఎన్.టి.ఆర్ అయినా సెట్స్ లో వర్క్ మీద చాలా సీరియస్ గా ఉంటారన్న టాక్ ఉంది కానీ ఏయన్నార్ మాత్రం చాలా సరదాగా ఉంటారని అంటుంటారు. అంతేకాదు హీరోయిన్స్ ని ఆట పట్టించడంలో ఏయన్నార్ తర్వాతే ఎవరైనా అని టాక్. దాదాపు అప్పటితరం స్టార్ హీరోయిన్స్ అందరితో ఏయన్నార్ నటించారు.

ఏయన్నార్ చేసిన లవ్ స్టోరీస్ కి బాగా క్రేజ్ ఉండేది. ఇదిలాఉంటే అంత గొప్ప నటుడికి ఒక స్టార్ హీరోయిన్ అంటే భయమట. ఇంతకీ ఏయన్నార్ (ANR) ని సైతం భయపెట్టిన నటి ఎవరంటే సహజ నటి జయసుధ అని తెలుస్తుంది. ఏయన్నార్, జయసుధ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే జయసుధతో నటించడం కష్టమని అన్నారట. ఆమె సోలో పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తుందని ఆమెని అబ్సర్వ్ చేసి నెక్స్ట్ మనతో కలిసి చేసే సీన్ డామినేట్ చేయకపోతే దెబ్బైపోతామని ఏయన్నార్ ఒకసారి మురళి మోహన్ తో చెప్పారట.

రీసెంట్ గా మురళిమోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు. మొత్తానికి అలా ఏయన్నార్ ని సైతం భయపడేలా చేసింది జయసుధ. ఇప్పటికి మదర్ రోల్స్ లో జయసుధ అలరిస్తున్నారు.

Tags: Akkineni Nageswara Rao, ANR, ANR Movies, Jayasudha, Tollywood